Jobs: ఆ రంగంలో కొత్తగా 1,49,000 ఉద్యోగాలు

Job Opportunities | చిన్న పట్టణాలకు సైతం ఆన్‌లైన్ సెల్లర్ బేస్ పెరుగుతుండటమే లాజిస్టిక్స్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి కారణమని టీమ్‌లీజ్ సర్వీసెస్ 'ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్' నివేదిక సారాంశం.

news18-telugu
Updated: June 25, 2019, 1:02 PM IST
Jobs: ఆ రంగంలో కొత్తగా 1,49,000 ఉద్యోగాలు
Jobs: ఆ రంగంలో కొత్తగా 1,49,000 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 25, 2019, 1:02 PM IST
ఉద్యోగాలు లేక కష్టాలు ఎదుర్కొంటున్నవారికి శుభవార్త. భారతదేశంలో విస్తరిస్తున్న కొత్త రంగాలు మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇ-కామర్స్ వ్యాపారం పుంజుకోవడంతో దానికి అనుబంధంగా లాజిస్టిక్స్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో ఒక్క లాజిస్టిక్స్ రంగం 1,49,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. చిన్న పట్టణాలకు సైతం ఆన్‌లైన్ సెల్లర్ బేస్ పెరుగుతుండటమే లాజిస్టిక్స్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి కారణమని టీమ్‌లీజ్ సర్వీసెస్ 'ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్' నివేదిక సారాంశం. లాజిస్టిక్ రంగం 3 శాతం విస్తరించి కొత్తగా 1,49,000 ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంచనా.

మొత్తం 19 రంగాలు, 14 భూభాగాల్లో భారతదేశంలోని 775 సంస్థలు, ప్రపంచంవ్యాప్తంగా 85 వ్యాపారసంస్థలపై అధ్యయనం జరిపి తయారు 'ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్' నివేదికను రూపొందించింది టీమ్‌లీజ్ సర్వీసెస్. 2018-19 రెండో అర్థభాగం నాటికి లాజిస్టిక్స్ రంగంలో 82.4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇ-కామర్స్ కంపెనీలు టైర్-2, టైర్-3 సిటీలకు విస్తరిస్తుండటంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ హెడ్ సుదీప్ సేన్ చెబుతున్నారు. లాజిస్టిక్స్ రంగంలో 14.19 శాతం ఉద్యోగ వృద్ధి కనిపిస్తోందని, లాజిస్టిక్స్‌లోని రైల్వేస్, జలమార్గాలు, వాయు మార్గాలు, వేర్ హౌజింగ్ విభాగాల్లో నిపుణులకు మంచి అవకాశాలున్నాయన్నారు.

లాజిస్టిక్స్ రంగంలో భారతదేశంలోని నగరాల్లో 31,480 కొత్త ఉద్యోగాలతో ముంబై టాప్‌లో ఉండగా, 28,510 కొత్త ఉద్యోగాలతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో టైర్-2 పట్టణాల్లో నియామకాలు 5 శాతం పెరుగుతాయని, టైర్-2 పట్టణాల్లో నియామకాలు 2 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Realme: రియల్‌మీ నుంచి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... ఫోటో తీస్తే ఇలా ఉంటుంది
Loading...
RBI: ఆ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... జూలై 1 నుంచి కొత్త రూల్స్

IRCTC Tour: తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ
First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...