Home /News /jobs /

LIST OF NEW UG AND PG COURSES LAUNCHED BY IGNOU IN FEBRUARY 2022 IGNOUIOP SAMARTH EDU IN IGNOUADMISSION SAMARTH EDU IN GH VB

IGNOU: సరికొత్త ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్న ఇగ్నో.. ఫిబ్రవరిలో లాంచ్‌ చేసిన కోర్సులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఫిబ్రవరిలో వివిధ ఆన్‌లైన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులను ఇగ్నో ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఉన్న కోర్సులు ఏవో చూద్దాం.

భారత విద్యార్థులకు విస్తృత విద్యావకాశాలు కల్పించేందుకు ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (IGNOU) వివిధ కోర్సులను అందిస్తోంది. అగ్రికల్చర్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, లింగ్విస్టిక్స్‌ తదితర విభాగాల్లో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి చేయవచ్చు. సర్టిఫికేట్‌ కోర్సు, డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులను ఇగ్నో అందిస్తోంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరిలో వివిధ ఆన్‌లైన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులను ప్రకటించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ignouadmission.samarth.edu.in లేదా ignouiop.samarth.edu.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.

కొత్తగా ఇగ్నో తీసుకొచ్చిన కోర్సులు ఇవే..

స్పానిష్‌ అండ్‌ ఫ్రెంచ్‌ (ఆన్‌లైన్‌)
2022 జవనరి నుంచి ఇగ్నోకు సంబంధించిన స్కూల్‌ ఆఫ్‌ ఫారన్‌ ల్యాంగ్వేజెస్‌ (School Of Foreign Languages) ద్వారా స్పానిస్‌, ఫ్రెంచ్‌ ల్యాంగ్వేజెస్‌పై ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ ignouiop.samarth.edu.in ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి ఆరు నెలలు. దీనికి రూ.4,500 ఫీజుగా నిర్ణయించారు. గుర్తింపు పొందిన బోర్డు, పాఠశాలల నుంచి 12వ తరగతి పూర్తి చేసినవారు, లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అప్లై చేస్తున్న వారికి కచ్చితంగా బేసిక్‌ ఇంగ్లిష్‌ తెలిసి ఉండాలి.

Govt Jobs 2022: బీఎన్‌పీలో ఉద్యోగాలు.. నెల‌కు వేత‌నం రూ. 67, 390 .. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌
ఇగ్నోకు చెందిన స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌(School Of Continuing Education) ద్వారా ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సర్టిఫికేషన్‌ కోర్సును 2022 ఫిబ్రవరి 14న లాంచ్‌ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ ignouiop.samarth.edu.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. కోర్సుకు అప్లై చేస్తున్న నాటికి 18 ఏళ్లు పూర్తయి ఉండాలి. కోర్సుకు రూ.1,900 చెల్లించాలి, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 చెల్లించాలి. ఆన్‌లైన్‌ మోడ్‌లో హిందీ, ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంది. ఆరు నెలల్లో కోర్సు పూర్తవుతుంది.

ఎంఏ సస్టైనబిలిటీ సైన్స్‌
ఇగ్నోకు చెందిన ఇంటెర్‌డిసిప్లైనరీ అండ్‌ ట్రాన్స్‌డిసిప్లైనరీ స్టడీస్‌(Interdisciplinary and Transdisciplinary) ద్వారా జనవరిలో ఎంఏ సస్టైనబిలిటీ సైన్స్‌ కోర్సును తీసుకొచ్చారు. ఇది ఇండియాలోనే మొదటిసారి అందిస్తున్న సస్టైనబిలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సుగా ఇగ్నో పేర్కొంది. నేషనల్‌ ఎడ్యేకేషన్‌ పాలసీలో భాగంగా అన్ని విభాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కోర్సు ఉంటుందని తెలిపింది. ఏడాది ఉండే కోర్సును పూర్తి చేశాక పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ సస్టైనబిలిటీ సర్టిఫికేట్‌ అందుతుంది. సంవత్సరానికి ఫీజు రూ.7,000 ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

సర్టిఫికేట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
రూరల్‌ సొసైటీ అభివృద్ధిని ప్రభావితం చేస్తున్న సామాజిక, ఆర్థిక కారణాలపై అవగాహన కల్పించేలా రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్టిఫికేట్‌ కోర్సును రూపొందించారు. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆరు నెలల ఉన్న కోర్సుకు ఫీజు రూ.1,800. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 చెల్లించాలి.

మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
ఈ కోర్సు కాల వ్యవధి రెండు సంవత్సరాలు. ఏడాదికి ఫీజు రూ.5,900గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 ఉంటుంది. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగతులు, జీవనవిధానాలను తెలుసుకొనేలా కోర్సును రూపొందించారు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా రూరల్‌ డెవలప్‌మెంట్
గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కోర్సు ఏడాదిపాటు ఉంటుంది. రూ.2,400 ఫీజును చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 ఉంటుంది. రూరల్‌ డెవలప్‌మెంట్‌లో కీలక కోణాలను తెలియజేసేలా కోర్సును తీర్చిదిద్దారు.

Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు, అర్హ‌త‌లు, అప్లికేష‌న్ స‌మాచారం

డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ (DHORT)
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ ఆఫ్‌ ది మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ నిధులతో డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. ఈ కోర్సు ఏడాది పాటు ఉంటుంది. మూడేళ్ల లోగా అభ్యర్థులు కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన కళాశాల నుంచి 12వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు.

ఎమ్మెస్సీ ఇన్‌ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (Msc FSQM)
ఎమ్మెస్సీ ఇన్‌ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు రెండేళ్లపాటు ఉంటుంది. నాలుగేళ్లలోపు అభ్యర్థులు కోర్సును పూర్తిచేసుకోవాలి. కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ సబ్జెక్టుగా యూజీ లేదా పీజీని పూర్తి చేయవచ్చు. అగ్రికల్చరక, ఫుడ్‌ సైన్సెస్‌, ఫుడ్‌ టెక్నాలజీ, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ హోం సైన్సెస్‌ తదితర కోర్సుల్లో యూజీ, పీజీ ఉంటుంది. పీజీ డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసినవారు ఈ కోర్సు రెండో ఏడాదిలో నేరుగా చేరవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అగ్రిబిజినెస్‌(PGDAB)
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అప్లై చేయవచ్చు. రైతుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, దళారులు, వ్యాపారస్థుల వ్యవహారాలపై, అగ్రి ఎంటర్‌ప్రైజ్‌ వ్యవస్థపై అవగాహన కల్పిస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IGNOU, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు