Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా?

Top 10 Jobs | మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్ని చేయాలనుకుంటున్నారా? ఎలాంటి సంక్షోభం వచ్చినా ముప్పులేని కెరీర్‌ను ఎంచుకోవాలనుకుంటున్నారా? లింక్డ్‌ఇన్ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే.

Santhosh Kumar S | news18-telugu
Updated: July 6, 2020, 10:49 AM IST
Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా?
Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభం ఉద్యోగాలకు ముప్పు తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అయితే ఇప్పటికీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. ఆ స్కిల్స్ ఉంటే ఈ సంక్షోభంలో కూడా దర్జాగా ఉద్యోగాలు చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్న టాప్ జాబ్స్ ఏవి అని మైక్రోసాఫ్ట్, లింక్డ్‌ఇన్ ఓ అధ్యయనం జరిపాయి. ఆ రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. 69 కోట్ల మంది ఉద్యోగులు, 5 కోట్ల కంపెనీలు, 1.1 కోట్ల జాబ్ లిస్టింగ్స్, 36,000 స్కిల్స్, 90,000 స్కూల్స్‌ను పరిగణలోకి తీసుకొని డిమాండ్‌లో ఉన్న స్కిల్స్, డిమాండ్ పెరుగుతున్న జాబ్స్, మారుతున్న నియామక ప్రక్రియలపై అధ్యయనం జరిపాయి.

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారికి సాయం చేయడమే మా లక్ష్యం. అవసరమైన స్కిల్స్ నేర్చుకొని కొత్త ఉద్యోగంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం. వారికి ఉచితంగా స్కిల్స్ నేర్పించడం, ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త అవకాశాలను నిరుద్యోగులకు తెలిసేలా మా వంతు కృషి చేస్తున్నాం.

రియాన్ రోస్లాన్‌స్కీ, లింక్డ్‌ఇన్ సీఈఓ

లింక్డ్‌ఇన్ అధ్యయనం ప్రకారం డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే...


డిజిటల్ మార్కెటర్
ఐటీ సపోర్ట్ / హెల్ప్ డెస్క్
గ్రాఫిక్ డిజైనర్

ఫైనాన్షియల్ అనలిస్ట్
డేటా అనలిస్ట్
సాఫ్ట్‌వేర్ డెవలపర్
ప్రాజెక్ట్ మేనేజర్
సేల్స్ రిప్రజెంటేటీవ్
ఐటీ అడ్మినిస్ట్రేటర్
కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్

ఈ 10 ఉద్యోగాలకు ఆన్‌లైన్ ట్రైనింగ్ అందుబాటులో ఉంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ కూడా పొందొచ్చు. అనేక ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్స్ ఈ కోర్సుల్ని ఉచితంగా కూడా అందిస్తున్నాయి. భారతదేశంలో నిరుద్యోగం మే నెలలో 23.5 శాతం ఉంటే లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో జూన్ నాటికి 11 శాతానికి పడిపోయిందని సెంటర్ ఫర్ మానిటర్ ఇండియన్ ఎకనమీ-CMIE విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న స్కిల్స్ వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు.

 
Published by: Santhosh Kumar S
First published: July 6, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading