హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

LIC Recruitment 2022 : LIC నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హత, దరఖాస్తు విధానం ఇలా..

LIC Recruitment 2022 : LIC నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హత, దరఖాస్తు విధానం ఇలా..

LIC Recruitment 2022 : LIC నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హత, దరఖాస్తు విధానం ఇలా..

LIC Recruitment 2022 : LIC నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హత, దరఖాస్తు విధానం ఇలా..

LIC Recruitment 2022 : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( LIC ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్బోబర్ 10, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( LIC ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO), చీఫ్ డిజిటల్ ఆఫీసర్ (CDO) మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్ licindia.inకి లాగిన్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు అక్టోబర్ 10, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 03 ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయబడతాయి. అర్హత గల అభ్యర్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనిలో పేరు, ఈ మెయిల్, మొబైల్ నంబర్ ను ఇవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ మొబైల్, ఈ మెయిల్ కు పంపడతాయి. వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

ఖాళీల వివరాలిలా..

1. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్/ సెంట్రల్ ఆఫీస్ ముంబై: 01 పోస్ట్

2. చీఫ్ డిజిటల్ ఆఫీసర్/ సెంట్రల్ ఆఫీస్ ముంబై: 01 పోస్ట్

3. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్/ సెంట్రల్ ఆఫీస్ ముంబై: 01 పోస్ట్

Indian Railway jobs: రైల్వేలో ఉద్యోగాలు .. రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

ముఖ్యమైన తేదీలు ఇవే..

దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 10, 2022

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: అక్టోబర్ 10, 2022

దరఖాస్తు వివరాలను సవరించడానికి చివరి తేదీ : అక్టోబర్ 10, 2022

మీ దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి కి చివరి తేదీ: అక్టోబర్ 25, 2022

TSPSC New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడో, రేపో 738 పోస్టులకు నోటిఫికేషన్..

విద్యార్హతలు..

చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO) : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా MCA లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సమానమైన అర్హత పొంది ఉండాలి.

చీఫ్ డిజిటల్ ఆఫీసర్ : బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ప్రాధాన్యంగా బిజినెస్/టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/డిజిటల్ మార్కెటింగ్ లేదా సంబంధిత రంగంలో ఉత్తీర్ణత సాధించాలి.

చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (CISO): ప్రముఖ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

దారఖాస్తు ఫీజు..

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా..

స్క్రీనింగ్ టెస్టు లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ కొరకు షార్ట్-లిస్ట్ చేయబడతారు.స్క్రీనింగ్ టెస్టు మరియు ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

- ముందుగా అధికారిక వెబ్ సైట్ licindia.in ను సందర్శించాలి.

-హోమ్‌పేజీలో, కెరీర్‌ విభాగంపై క్లిక్ చేయండి.

-తర్వాత అక్కడ నుంచి మరో పేజీకి వెళ్తారు.

-అక్కడ అప్లై ఆన్‌లైన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

-దీనిలో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

-దరఖాస్తు ఫీజను చెల్లించి అప్లికేషన్ ఫారమ్ ను సబ్ మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కొరకు పారమ్ కు ప్రింట్‌ అవుట్ తీసుకోండి.

పూర్తి వివరాలకు PDF ను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, LIC, LIC IPO, Life Insurance

ఉత్తమ కథలు