LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే

LIC HFL Recruitment 2019 | ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన తర్వాత ఏడాది ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది.

news18-telugu
Updated: December 5, 2019, 11:21 AM IST
LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే
LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LIC HFL అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లీగల్ విభాగంలో ఈ పోస్టులున్నాయి. మొత్తం 35 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఏదో ఓ రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన తర్వాత ఏడాది ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 16 చివరి తేదీ. https://www.lichousing.com/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

LIC HFL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) మొత్తం ఖాళీలు- 35

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2020 జనవరి 27


విద్యార్హత- న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (LLB) 55 శాతం మార్కులతో పాస్ కావాలి. కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి.
Loading...
వయస్సు- 2019 జనవరి 1 నాటికి 23 నుంచి 30 ఏళ్లు.
వేతనం- రూ.56,000.
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టుల భర్తీకి ఎల్ఐసీ హౌసింగ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X2 Pro: తక్కువ ధరకే రానున్న రియల్‌మీ ఎక్స్‌2 ప్రో... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Indian Air Force Jobs: పెళ్లికానివారికి ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో శిక్షణ

Govt Jobs: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ రిలీజ్

Railway Jobs: రైల్వే జాబ్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్... ఎందుకో తెలుసా?
First published: December 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...