Home /News /jobs /

LIC RECRUITMENT 2020 LIFE INSURANCE CORPORATION OF INDIA RELEASED NOTIFICATION TO FILL 218 AE AAO POSTS KNOW DETAILS SS

LIC Recruitment 2020: ఎల్ఐసీలో 218 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

LIC Recruitment 2020: ఎల్ఐసీలో 218 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Recruitment 2020: ఎల్ఐసీలో 218 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

LIC AE AAO Recruitment 2020 | ఎల్ఐసీలో ఏఏఓ, ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 218 ఖాళీలను భర్తీ చేస్తోంది ఎల్ఐసీ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్-AE, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్-AAO, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్-AA పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 218 పోస్టుల్ని ప్రకటించింది. సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://licindia.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు.

    LIC AE AAO Recruitment 2020: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 218
    అసిస్టెంట్ ఇంజనీర్ (AE)- 50
    అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- 29
    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 10
    అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ (ఆర్కిటెక్ట్)- 4
    అసిస్టెంట్ ఇంజనీర్ (స్ట్రక్చరల్)- 4
    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ / మెకానికల్)- 3

    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (AAO)- 168
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (సీఏ)- 40
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (యాక్చుఏరియల్)- 30
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (లీగల్)- 40
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (రాజ్‌భాషా)- 8
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (ఐటీ)- 50

    LIC Recruitment 2020, LIC Jobs 2020, LIC AAO Recruitment 2020, LIC Assistant Administrative Officer Recruitment 2020, Life Insurance Corporation of India jobs, ఎల్ఐసీ రిక్రూట్‌మెంట్ 2020, ఎల్ఐసీ ఉద్యోగాలు 2020, ఎల్ఐసీ ఏఏఓ రిక్రూట్‌మెంట్ 2020, ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2020, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు
    Source: LIC Notification

    LIC AE AAO Recruitment 2020: విద్యార్హతలివే...


    అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- సివిల్‌లో బీటెక్ లేదా బీఈ.
    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- ఎలక్ట్రికల్‌లో బీటెక్ లేదా బీఈ.
    అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ (ఆర్కిటెక్ట్)- బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్.
    అసిస్టెంట్ ఇంజనీర్ (స్ట్రక్చరల్)- స్ట్రక్చరల్‌లో ఎంటెక్ లేదా ఎంఈ.
    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ / మెకానికల్)- మెకానికల్ లేదా ఎలక్ట్రికల్‌లో బీటెక్ లేదా బీఈ.
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (సీఏ)- బ్యాచిలర్స్ డిగ్రీ.
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (యాక్చుఏరియల్)- బ్యాచిలర్స్ డిగ్రీ.
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (లీగల్)- బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లేదా ఎల్ఎల్ఎం.
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (రాజ్‌భాషా)- పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ లేదా హిందీ ట్రాన్స్‌లేషన్. డిగ్రీస్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి.
    అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (ఐటీ)- గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్‌సీ కంప్యూటర్ సైన్స్

    LIC AE AAO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 25
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 15
    వయస్సు- 21 నుంచి 30 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.85.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

    Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు... అప్లై చేయండిలా

    Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, LIC, NOTIFICATION

    తదుపరి వార్తలు