హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

LIC AAO Jobs: భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన LIC.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

LIC AAO Jobs: భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన LIC.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

LIC AAO: భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన LIC.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

LIC AAO: భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన LIC.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక సైట్ licindia.in ను సందర్శించాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Life Insurance Corporation Of India) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక సైట్ licindia.in ను సందర్శించాలి.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. LIC AAO 2023 కోసం ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. దీని తర్వాత అభ్యర్థి ప్రధాన పరీక్షకు హాజరు కావాలి. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థికి రూ.53, 600 వేతనం ఇవ్వబడుతుంది.

UG-PG Scholarships: విద్యార్థులకు అలర్ట్.. మెరిట్ స్కాలర్‌‌షిప్స్ కొరకు రూ.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం..

దరఖాస్తు ఫీజు

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. కాగా రిజర్వ్‌డ్ కేటగిరీకి అంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రుసుము రూ.85 చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జనవరి 15

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జనవరి 31

అడ్మిట్ కార్డ్ జారీ చేసిన తేదీ: పరీక్షకు ఒక వారం ముందు

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 17 మరియు 20

మెయిన్స్ పరీక్ష తేదీ: మార్చి 18

దరఖాస్తుల స్వీకరణకు ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.

First published:

Tags: JOBS, LIC, Telangana government jobs

ఉత్తమ కథలు