LIC Jobs: ఎల్ఐసీలో 8581 జాబ్స్... పరీక్షకు ప్రిపేర్ అవ్వండి ఇలా...చదవాల్సిన పుస్తకాలు ఇవే..

LIC Jobs | ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలను ప్రణాళిక ప్రకారం అధిగమించితే ఆ జాబ్స్‌ని కొట్టడం అంత కష్టమేమి కాదు.. ఇందులో ముఖ్యంగా పరీక్షలు మూడు కేటగిరీల్లో ఉంటాయి. ఓపెన్ మార్కెట్ కేటగిరీ, ఏజంట్స్ కేటగిరీ, ఎంప్లాయిస్ కేటగిరీ..

news18-telugu
Updated: May 29, 2019, 4:18 PM IST
LIC Jobs: ఎల్ఐసీలో 8581 జాబ్స్... పరీక్షకు ప్రిపేర్ అవ్వండి ఇలా...చదవాల్సిన పుస్తకాలు ఇవే..
ఎల్‌ఐసీలో 8,581 ఉద్యోగాలు ఇలా ప్రిపేర్ అవ్వండి..
  • Share this:
ఎల్ఐసీలో 8,581 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఒక్క హైదరాబాద్‌ జోన్‌లే 1250 ఖాళీలున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలను ప్రణాళిక ప్రకారం అధిగమించితే ఆ జాబ్స్‌ని కొట్టడం అంత కష్టమేమి కాదు.. ఇందులో ముఖ్యంగా పరీక్షలు మూడు కేటగిరీల్లో ఉంటాయి. ఓపెన్ మార్కెట్ కేటగిరీ, ఏజంట్స్ కేటగిరీ, ఎంప్లాయిస్ కేటగిరీ..

ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ క్వాలీఫై అవ్వాలి..

జూలై 6 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. సమయం ఎక్కుగానే ఉంది కాబట్టి.. ప్రణాళిక ప్రకారం చదివితే విజయం సాధ్యం. మాక్‌టెస్ట్‌లు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. రోుకి ఒకటి రెండు మాక్‌టెస్ట్‌లు రాస్తూ స్కోర్ సరిచూసుకుంటుండాలి. రీజనింగ్‌లో ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, ఫజిల్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్‌లో పట్టు సాధించాలి. వేగంగా సమాధానాలు రాబట్టేలా ప్రాక్టీస్ చేయాలి. షార్ట్‌కట్స్ నేర్చుకుంటుండాలి. ఎగ్జామ్‌హాల్‌లో ఎగ్జామ్ రఫ్ వర్క్‌లో ముందుగా A నుంచి Z, Z నుంచి A అక్షరాలను రాయాలి. రీజనింగ్ ప్రతీ ప్రశ్నలోనూ ఇవి మీకు అవసరమవుతాయి.

మెయిన్స్ పరీక్ష విధానంలో..
రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్‌లకు కలిపి 50 మార్కుల ప్రశ్నలుంటాయి.

లాంగ్వేజ్(గ్రామర్ వొకాబులరీకి ప్రాధాన్యం) ఉంటుంది. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్‌కి 50 మార్కుల ప్రశ్నలుంటాయి.
మార్కెటింగ్ అవేర్‌నెస్ 50 మార్కుల ప్రశ్నలుంటాయి.మెయిన్స్ పరీక్ష మొత్తానికి కేటాయించిన సమయం 120 నిమిషాలు

ఎంప్లాయిస్ కేటగిరీ పరీక్ష..
రీజనింగ్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ 25 మార్కుల ప్రశ్నలుంటాయి.
జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్‌లో 25 మార్కుల ప్రశ్నలుంటాయి.
ప్రాక్టీస్ అండ్ ప్రిన్స్‌పుల్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్‌లో 50 మార్కుల ప్రశ్నలుంటాయి.

న్యూమరికల్ ఎబిలీటీ.. ఇందుల్ నంబర్ సిస్టమ్‌తో పాటు ఆర్థమెటిక్‌లో భాగా సరాసరి, శాతాలు, నిష్పత్తులు, క్షేత్రమితి, సరళ, చక్రవడ్డీలు వంటి పదోతరగతి స్థాయి ప్రశ్నలుంటాయి. BODMAS ఆధారిత సూక్ష్మీకరణలు రోజుకి 200 వరకు ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం ఉంటుంది. పని -సమయం ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లీష్ : ఇందులో కాంప్రెహెన్షన్, వొకాబులరీ, ఫ్రేజల్ వర్బ్స్, ప్రొవెర్బ్స్ చదవాలి. ఎక్కువగా ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉంటే మనకి మనమే ప్రశ్నలు వేసుకుంటూ.. కొత్త పదాలకు అర్థం తెలుసుకుంటే చాలు.

ఏజెంట్స్ కేటగిరీ పరీక్ష విధానం..
రీజనింగ్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ 25 ప్రశ్నలకు 10 మార్కులు
జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ 25 ప్రశ్నలకు 10 మార్కులు
ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్సూరెన్స్ 50 ప్రశ్నలకు 125 మార్కులు

చదవాల్సిన పుస్తకాలు..
రీజనింగ్, బ్యాంక్ పరీక్షలకు (ఆర్ఎస్ అగర్వాల్)
బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ ప్రచురణ, ఫజిల్స్( కుందన్)
గణితం -ఆర్ఎస్ అగర్వాల్ ఆర్థమెటిక్ లేదా బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ ప్రచురించిన పుస్తకం(ఆథర్ టైరా)
ఇంగ్లీష్ టాటా గ్రామర్ పుస్తకం, ధిల్లాన పబ్లికషన్స్
జనరల్ నాలెడ్జ్ లూసెంట్ లేదా అరిహంత్ పబ్లికేషన్స్ పుస్తకాలు
మార్కెటింగ్ - లూసెంట్
కరెంట్ అఫైర్స్ -ఆన్‌లైన్ వచ్చేవి ఏవైనా ప్రిపేర్ కావొచ్చు..

లక్ష్యాలు చేరుకోవాలనే కోరికే కాదు.. అందుకు తగ్గ సాధన కూడా ఉండాలి. ఈరోజు శ్రమే రేపటి ఫలితం కాబట్టి.. వేటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక ప్రకారం చదువుతూ జాబ్స్ కొట్టేయండి..

ఇవి కూడా చదవండి..

Govt Jobs : తాజా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే.. అప్లై చేసేయండి..చివరితేదీ దగ్గరికొచ్చేసింది..

Govt Jobs : SAILలో ఉద్యోగాలు.. అధికంగా జీతాలు..

Indian Railway Jobs : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో జాబ్స్.. ఈరోజే ఇంటర్వ్యూ..
First published: May 29, 2019, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading