LIC HFL Jobs: ఎల్ఐసీ హౌజింగ్‌లో 300 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

LIC HFL Recruitment 2019 | దరఖాస్తుకు ఆగస్ట్ 26 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు.

news18-telugu
Updated: August 24, 2019, 1:50 PM IST
LIC HFL Jobs: ఎల్ఐసీ హౌజింగ్‌లో 300 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
LIC HFL Jobs: ఎల్ఐసీ హౌజింగ్‌లో 300 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 24, 2019, 1:50 PM IST
నిరుద్యోగులకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్- LIC HFL అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 300 పోస్టులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, చండీగఢ్, కర్నాటక, కేరళ, పుదుచ్చెరీ, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. దరఖాస్తుకు ఆగస్ట్ 26 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

LIC HFL Recruitment 2019: ఖాళీలు, అర్హతల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 300

అసిస్టెంట్ పోస్టులు- 125
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు- 100
అసోసియేట్ పోస్టులు- 75


విద్యార్హత: అసిస్టెంట్ పోస్టుకు 55% మార్కులతో గ్రాడ్యుయేషన్. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎంబీఏ / పీజీడీఎం, పీజీ డిప్లొమా, రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంఎంఎస్ / రెండేళ్ల ఫుల్ టైమ్ PGDBA/ PGDBM/ PGPM/ PGDM కోర్సులు చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అసోసియేట్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ ఇంటర్ ఉండాలి.
Loading...
వయస్సు: 21 నుంచి 28 ఏళ్లు
ఫీజు: రూ.500

LIC HFL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 08
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు- 2019 ఆగస్ట్ 26
కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2019 సెప్టెంబర్ 09
ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలిక తేదీ)- 2019 అక్టోబర్ 09 లేదా 10

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Scholarship: విద్యార్థులకు స్కాలర్‌షిప్... దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ

MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

AAI Cargo Jobs: ఏఏఐ కార్గోలో మల్టీటాస్కర్, సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు... నేరుగా ఇంటర్వ్యూ
First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...