విద్యార్థులకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (LIC) చెందిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రకటించింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్షిప్ 2022 (LIC HFL Vidyadhan Scholarship 2022) పేరుతో ఈ స్కాలర్షిప్ అందుబాటులో ఉంది. ప్రతిభ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ (Scholarship) పొందొచ్చు. తక్కువ ఆదాయం ఉన్న, పలు సంక్షోభాలు ఎదుర్కొంటున్న కుటుంబంలోని విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ అందిస్తోంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఆసక్తి గల విద్యార్థులు 2022 అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు Buddy4Study పోర్టల్‌లో అప్లై చేయాలి. ఈ స్కాలర్షిప్ వివరాలు తెలుసుకోండి.
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 31
స్కాలర్షిప్ మొత్తం- నెలకు రూ.20,000 చొప్పున ఏడాదికి రూ.2,40,000 స్కాలర్షిప్ లభిస్తుంది. రెండేళ్లకు కలిపి రూ.4,80,000 వరకు స్కాలర్షిప్ పొందొచ్చు.
విద్యార్హతలు- పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మొదటి ఏడాదిలో ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు. భారతదేశంలో గుర్తింపు పొందిన కాలేజీ, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఎన్రోల్ చేసుకొని ఉండాలి. అండర్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
ఇతర అర్హతలు- కుటుంబ వార్షికాదాయం ఏడాదికి రూ.3,60,000 లోపు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. 2020 జనవరి నుంచి కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని, ఇంట్లో సంపాదిస్తున్న కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగం లేదా జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
Post Office Jobs: పోస్ ఆఫీస్‌లో 188 ఉద్యోగాలు ... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
ఐడెంటిటీ ప్రూఫ్- ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ పాస్‌పోర్ట్.
విద్యార్హతలకు సంబంధించిన మార్క్స్ షీట్.
ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా ఫామ్ 16ఏ లేదా సాలరీ స్లిప్స్.
అడ్మిషన్‌కు సంబంధించిన ప్రూఫ్- విద్యా సంస్థ జారీ చేసిన ఐడీ కార్డ్, బోనఫైడ్ సర్టిఫికెట్.
కళాశాలకు చెందిన ఫీజ్ రిసిప్ట్.
స్కాలర్షిప్ కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు.
క్రైసిస్ డాక్యుమెంట్, డిసేబిలిటీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ (ఇవి వర్తించేవారికి తప్పనిసరి)
IRCTC Recruitment 2022: ఐఆర్సీటీసీలో 80 జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం
Step 1- విద్యార్థులు https://www.buddy4study.com/page/lic-hfl-vidhyadhan-scholarship వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Apply Now పైన క్లిక్ చేయాలి.
Step 3- విద్యార్థులు తమ ఇమెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ లేదా జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ కావాలి.
Step 4- విద్యార్థులు తమ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
Step 5- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
Step 6- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, LIC, LICHFL, Scholarship