లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (LIC) చెందిన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, నార్తర్న్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్ రీజియన్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఆగస్ట్ 25 చివరి తేదీ. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం లాంటి వివరాలు తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 80 |
అసిస్టెంట్ | 50 (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 ఖాళీలు) |
అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ | 30 |
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే
దరఖాస్తు ప్రారంభం- 2022 ఆగస్ట్ 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఆగస్ట్ 25
అడ్మిట్ కార్డ్ విడుదల- పరీక్షకు 7 నుంచి 14 రోజుల ముందు
అసిస్టెంట్ ఎగ్జామ్ తేదీ- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్
అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ తేదీ- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
SAIL Recruitment 2022: సెయిల్‌లో 200 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు
విద్యార్హతలు- అసిస్టెంట్ పోస్టుకు 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు మార్కెటింగ్, ఫైనాన్స్‌లో ఎంబీఏ పాస్ కావాలి. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరి.
అనుభవం- అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అనుభవం అవసరం లేదు. అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టుకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
వయస్సు- 2022 జనవరి 1 నాటికి అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.800
ఎంపిక విధానం- అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టుకు ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, అనుభవం.
వేతనం- అసిస్టెంట్ పోస్టుకు రూ.22,730 బేసిక్ వేతనంతో మొత్తం రూ.33,960 వేతనం లభిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రూ.53,620 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,110 వేతనం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Central Government Jobs, Govt Jobs 2022, JOBS, LIC, LICHFL