అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(Apprentice Development Officer) ఉద్యోగాలకు సంబంధించి LIC భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,394 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ LIC ADO ఉద్యోగాలకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 21, 2023 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే దీనికి నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023. 2023 రిక్రూట్‌మెంట్ సంవత్సరానికి అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) నోటిఫై చేసిన మొత్తం ఖాళీలు 9394. జోన్ల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
మొత్తం 9394 ఖాళీలు..
1. తూర్పు జోనల్ కార్యాలయం (కోల్‌కతా) - 1049
2. వెస్ట్రన్ జోనల్ ఆఫీస్ (ముంబై) - 1942
3. ఉత్తర జోనల్ కార్యాలయం (న్యూ ఢిల్లీ) - 1216
4. ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పాట్నా) - 669
5. నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్)- 1033
6. దక్షిణ జోనల్ కార్యాలయం (చెన్నై) - 1516
7. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్)- 1408
దీనిలో మన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్) కింద దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1408 ఖాళీలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కడప , మచిలీపట్నం, నెల్లూరు , రాజమండ్రి , విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ డివిజన్ల పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి..
జనరల్ అభ్యర్థులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లలోపు ఉండాలి.
OBCలో సభ్యుడైన LIC ఉద్యోగి (క్రీమీ లేయర్‌లో ఉన్నవారు కాకుండా): 45 సంవత్సరాలు
SC లేదా ST సభ్యుడైన LIC ఉద్యోగి: 47 సంవత్సరాలు
LIC ఏజెంట్ లేదా DSAలు/FSEలు వంటి ఏజెంట్ కాకుండా, SC లేదా ST లేదా OBCలో సభ్యులు కానివారు: 40 సంవత్సరాలు
LIC ఏజెంట్ లేదా DSAలు/FSEలు వంటి ఏజెంట్ కాకుండా, OBCలో సభ్యుడు (క్రీమీ లేయర్‌లో ఉన్నవారు కాకుండా): 43 సంవత్సరాలు
LIC ఏజెంట్ లేదా DSAలు/FSEలు వంటి ఏజెంట్ కాకుండా, SC లేదా ST సభ్యులు: 45 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
TSPSC Update: ఆ పరీక్షకు సంబంధించి .. ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నాపత్రం, OMR పత్రాలు విడుదల..
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
1. ప్రిలిమ్స్ పరీక్ష
2. మెయిన్స్ పరీక్ష
3. ఇంటర్వ్యూ ప్రక్రియ
ఎంపిక ప్రక్రియ..
ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు నిర్వహించబడుతుంది. దీనిలో ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌తో సహా మూడు విభాగాలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలకు కలిపి మార్కులు 70 (35+35), ఇంగ్లిష్ నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హులు అవుతారు.
మెయిన్స్ పరీక్ష: మెయిన్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. మొత్తం 150 మార్కులను కలిగి ఉంటుంది. దీనిలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
మెడికల్ ఎగ్జామినేషన్: ఇంటర్వ్యూ తర్వాత అర్హత పొందిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది. వారు ఈ దశలో విజయం సాధిస్తే.. అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (ADO) ఉద్యోగం పొందినట్టె.
దరఖాస్తుల ప్రారంభం ఇలా..
Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ www.licindia.inకి వెళ్లండి.
Step 2: హోమ్‌పేజీని క్రిందికి స్క్రోల్ చేసి.. "కెరీర్స్"పై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని కొత్త పేజీకి తీసుకెళుతుంది.
Step 3: LIC అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Step 4: మీ పేరు.. ఇమెయిల్ చిరునామా మరియు ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించండి.
Step 5: రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామా , మొబైల్ ఫోన్ నంబర్‌కు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఇమెయిల్ చేయబడుతుంది.
Step 6: దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ సమయంలో రూపొందించబడిన లాగిన్ వివరాలను ఉపయోగించండి.
Step 7: వ్యక్తిగత, విద్యాసంబంధమైన మరియు కమ్యూనికేషన్ సమాచారాన్ని సరిగ్గా పూరించాలి.
Step 8: మీ ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటన వేలి ముద్ర మొదలైనవాటిని అప్‌లోడ్ చేయండి.
Step 9: వెరిఫికేషన్ తర్వాత మాత్రమే ఆన్‌లైన్‌లో అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించండి.
Step 10: భవిష్యత్ సూచన కోసం LIC ADO 2023 దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, LIC, Lic ado, Life Insurance