హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

LIC Agent Jobs: లక్షల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుంటోన్న ఎల్ఐసీ... మీరూ దరఖాస్తు చేయండి ఇలా..

LIC Agent Jobs: లక్షల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుంటోన్న ఎల్ఐసీ... మీరూ దరఖాస్తు చేయండి ఇలా..

LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

LIC Agent Jobs | మీరు ఎల్ఐసీ ఏజెంట్‌గా లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థలో చేరాలనుకుంటున్నారా? ఎలా చేరాలో తెలుసుకోండి.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఏజెంట్ల నియామకంలో అదే దూకుడు చూపిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త ఏజెంట్లను నియమించుకుంటోంది. 2020 ఏప్రిల్ 1 నాటికి ఎల్ఐసీ ఏజెంట్ల సంఖ్య 12,08,826 కాగా 2021 ఏప్రిల్ 1 నాటికి 13,53,808 ఏజెంట్లు ఉన్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే ఎల్ఐసీలో 1,44,982 ఏజెంట్లు పెరిగారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీమా రంగంలో దిగ్గజ కంపెనీ అయిన ఎల్ఐసీ... డిమాండ్‌కు తగ్గట్టుగా బిజినెస్‌ను పెంచుకునేందుకు కొత్త ఏజెంట్లను నియమించుకుంటోంది. భారీ స్థాయిలో కొత్త ఏజెంట్లను చేర్చుకుంటోంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీలో 3,45,469 కొత్త ఏజెంట్లు చేరారు. అంటే రోజుకు సుమారు 1000 మంది ఏజెంట్లను నియమించుకుంటోంది ఎల్ఐసీ.

Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థలో ఏజెంట్‌గా చేరడానికి కేవలం టెన్త్ పాస్ అయితే చాలు. ఇన్స్యూరెన్స్ రంగం, పర్సనల్ ఫైనాన్స్ లాంటి అంశాల్లో కాస్త అవగాహన ఉంటే ఇంకా మంచిది. టెన్త్ పాసై, 18 ఏళ్ల వయస్సు దాటినవారు ఎవరైనా ఎల్ఐసీ ఏజెంట్ కావొచ్చు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు https://www.licindia.in/ వెబ్‌సైట్‌లో ఉంటాయి. లేదా మీకు దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. అక్కడే దరఖాస్తు కూడా చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి మీ టెన్త్ మెమో, 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. మొదట బ్రాంచ్ మేనేజర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ఏజెంట్‌గా పనికి వస్తారో లేదో నిర్ణయిస్తారు.

EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

మీరు ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరొచ్చు అని బ్రాంచ్ మేనేజర్ భావిస్తే మిమ్మల్ని డివిజనల్ లేదా ఏజెన్సీ ట్రైనింగ్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ లైఫ్ ఇన్స్యూరెన్స్ బిజినెస్‌కు సంబంధించి 25 గంటల శిక్షణ ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రీ-రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ రాయాలి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా మిమ్మల్ని నియమిస్తూ అపాయింట్‌మెంట్ లెటర్, ఐడీ కార్డ్ వస్తుంది. బ్రాంచ్ ఆఫీసులో డెవలప్‌మెంట్ ఆఫీసర్ టీమ్‌లో ఏజెంట్‌గా పనిచేయాల్సి ఉంటుంది.

మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, ఒక చోట కూర్చొని పనిచేసే ఉద్యోగం కాకుండా బయట తిరుగుతూ, నలుగురిని కలవడం ఎక్కువగా ఇష్టమైనా, రోజూ 8 గంటలో, 12 గంటలో పనిచేసే ఉద్యోగం కాకుండా ఎన్ని గంటలు పనిచేయాలో మీరే నిర్ణయించాలన్న మనస్తత్వం ఉన్నా ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరొచ్చు. ఎంత కష్టపడితే అంత ఆదాయం ఉంటుంది. అనేక లాభాలు, ప్రయోజనాలు ఉంటాయి. నిరంతరం శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి.

First published:

Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Health Insurance, Insurance, Job notification, JOBS, LIC, NOTIFICATION, Personal Finance, Upcoming jobs

ఉత్తమ కథలు