లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశవ్యాప్తంగా అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల్ని (LIC ADO Posts) భర్తీ చేస్తోంది. మొత్తం రూ.9,394 పోస్టులు ఉన్నాయి. వాటిలో 1408 పోస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ అయినవారు ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 ఫిబ్రవరి 10 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. వేతనాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఫోటో, సంతకం, తెల్లని పేపర్‌పై ఎడమ చేతి వేలిముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్ తప్పనిసరి. ఫీజ్ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
SSC Recruitment 2023: టెన్త్ అర్హతతో 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ... అప్లై చేయండిలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://licindia.in/Bottom-Links/careers వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Recruitment of Apprentice Development Officer 22-23 లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3- జోన్ల వారీగా నోటిఫికేషన్స్ వేర్వేరుగా ఉంటాయి.
Step 4- నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత చివర్లో APPLY NOW పైన క్లిక్ చేయాలి.
Step 5- కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
Step 6- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
Step 7- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- రెండో దశలో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 9- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 10- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 11- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
Step 12- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
TSPSC Alert: టీఎస్పీఎస్సీ అలర్ట్.. వారికి 5 శాతం మార్కుల మినహాంపు..
దరఖాస్తు ఫీజు వివరాలు చూస్తే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగులు, సాధారణ అభ్యర్థులకు వేర్వేరు కేటగిరీలు ఉంటాయి. అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరిధిలోకి వస్తే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్లై చేయాలి. అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 10 లోగా అప్లై చేయాలి. మార్చి 12న ప్రిలిమినరీ ఎగ్జామ్, ఏప్రిల్ 8న మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, JOBS, LIC