లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల్ని (LIC ADO Posts) భర్తీ చేస్తోంది ఎల్ఐసీ. దేశవ్యాప్తంగా మొత్తం 9,394 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో 1408 పోస్టులు సౌత్ సెంట్రల్ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో 1408 పోస్టులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ పట్టణంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 ఫిబ్రవరి 10 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు స్టైపెండ్, వేతనం, ఇతర బెనిఫిట్స్ ఏం ఉన్నాయో తెలుసుకోండి.
ఎల్ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి మొదట ప్రతీ నెలా స్టైపెండ్ లభిస్తుంది. ఈ స్టైపెండ్ ఎల్ఐసీ నిబంధనల ప్రకారం ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఎల్ఐసీ ఎంప్లాయీ కేటగిరీ కాకుండా ఇతర అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు స్టైపెండ్ ఒకేలా ఉంటుంది. ప్రతీ నెలా రూ.51,500 ఫిక్స్‌డ్ స్టైపెండ్ పొందొచ్చు. అప్రెంటీస్ కాలాన్ని ఎల్ఐసీ నిర్ణయిస్తుంది.
TSPSC Alert: టీఎస్పీఎస్సీ అలర్ట్.. వారికి 5 శాతం మార్కుల మినహాంపు..
అప్రెంటీస్ పూర్తైన తర్వాత ప్రొబెషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నియమిస్తారు. ప్రొబెషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు రూ.35,650 బేసిక్ వేతనంతో మొత్తం రూ.90,205 వేతనం లభిస్తుంది. అలవెన్సులు అదనంగా లభిస్తాయి. హౌజ్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ లాంటివి పొందొచ్చు. ఇది గరిష్టంగా రూ.56,000 వరకు లభిస్తుంది. ప్రొబేషన్ పీరియడ్ మొదట ఒక ఏడాది ఉంటుంది. అవసరాన్ని బట్టి రెండేళ్ల వరకు ప్రొబెషనరీ కాలాన్ని పొడిగిస్తారు.
ఇతర బెనిఫిట్స్ విషయానికి వస్తే గ్రాట్యుటీ, డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఎల్‌టీసీ, మెడికల్ బెనిఫిట్, గ్రూప్ ఇన్స్యూరెన్స్ , గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్, వెహికిల్ అడ్వాన్స్, రీంఇంబర్స్‌మెంట్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. వీటితో పాటు సర్వీస్‌లో చేరిన తర్వాత పర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటీవ్స్ కూడా లభిస్తాయి.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
IB Recruitment 2023: పది అర్హతో.. ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు .. మారిన తేదీలు ఇలా..
ఎల్ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు 2023 ఫిబ్రవరి 10 లోగా అప్లై చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 2023 మార్చి 4న కాల్‌లెటర్స్ విడుదలవుతాయి. 2023 మార్చి 12న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. 2023 ఏప్రిల్ 8న మెయిన్స్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 2023 జనవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apprenticeship, Job notification, JOBS, LIC, Recruitment