LIC ADO 2023 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) విడుదల చేసింది. వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ అడ్మిట్ కార్డ్‌లను LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LIC ADO 2023 ప్రిలిమ్స్ పరీక్ష మార్చి 12, 2023న జరగనుంది.
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండిలా..
-అభ్యర్థులు licindia.in లో LIC అధికారిక సైట్‌ని సందర్శించాలి .
-హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న LIC ADO కాల్ లెటర్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
-లాగిన్ వివరాలను నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి.
-మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
-ఇప్పుడు తదుపరి అవసరాల కోసం మీ దగ్గర హార్డ్ కాపీని ఉంచుకోండి.
పరీక్ష వివరాలు
ప్రిలిమ్స్ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. గరిష్ట మార్కులు 70. పరీక్ష వ్యవధి 1 గంట మరియు పరీక్ష ఆంగ్లం మరియు హిందీ భాషలలో నిర్వహించబడుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. మెయిన్ పరీక్ష ఏప్రిల్ 23న నిర్వహించనున్నారు.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,394 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో 1408 పోస్టులు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2023 ఫిబ్రవరి 10వ తేదీన ముగిసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష మార్చి 12న నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, LIC, Lic ado, Life Insurance