హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TRT SA Preparation: టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు సిద్ధమవుతున్నారా.. ? అయితే ఈ అంశాలపై శ్రద్ధ పెట్టండి..

TRT SA Preparation: టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు సిద్ధమవుతున్నారా.. ? అయితే ఈ అంశాలపై శ్రద్ధ పెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రంలో ఇది వరకే పలు ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారి చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ సాధన కోసం శ్రమిస్తున్నారు. మరికొందరు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే టిఆర్ టి పరీక్ష(TRT Exam) నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ మరోవైపు ఆ పరీక్ష కోసం సన్నద్దులవుతున్నారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఇది వరకే పలు ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారి చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ సాధన కోసం శ్రమిస్తున్నారు. మరికొందరు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే టిఆర్ టి పరీక్ష(TRT Exam) నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ మరోవైపు ఆ పరీక్ష కోసం సన్నద్దులవుతున్నారు. అయితే టిఆర్ టి లో స్కూల్ అసిస్టెంట్(School Assistant) పోస్టుల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులు ఏయే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి, చదవటానికి ఎటువంటి పుస్తకాలను ఎంచుకోవాలని, సిలబస్(Syllabus) ఏమిటి, ఎలా చదవాలి అన్న విషయాలపై ఆదిలాబాద్ కు చెందిన పోటీ పరీక్షల విశ్లేషకుడు బద్దం పురుషోత్తం రెడ్డి వివరించారు.

SA Preparation Tips: ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే.. ఈ పుస్తకాలను చదివేయండి.. కొలువు పక్కా..!


స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించిన పరీక్షా పత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయని, ప్రతి విభాగంలో ఒక్కో ప్రశ్నకు సగం మార్కు చొప్పున ఇస్తారు. మొదటి విభాగంలో 20 ప్రశ్నలు ఉంటే వాటికి పది మార్కులుంటాయని పేర్కొన్నారు. ఈ 20 ప్రశ్నలలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ, జాతీయ, వర్ధమాన సంఘటనలకు సంబంధించినవి అడుగుతారు.. కాబట్టి అభ్యర్థులు కనీసం సంవత్సరం కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు, సంఘటనలపై దృష్టి పెట్టి అందుకు సంబంధించిన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విభాగం పర్స్ పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలలో పది చాప్టర్లు ఉంటాయి. అందులో నుండే ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. ఇందులో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, పర్యావరణ విద్య, జనాభా విద్య, సమ్మిళత విద్య, ఉపాధ్యాయుల సాధికారిత తదితర అంశాలుంటాయి.

ఇంకా 21 ఏ ఆర్టికల్ కు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులోని ఏడు అధ్యాయాలకు సంబంధించిన ప్రశ్నలపై దృష్టిసారించాలి. ఇక మూడో విభాగం కంటెంట్. కంటెంట్ విషయంలో ఆరు నుండి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదువుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పాఠ్యంశాలకు సంబంధించిన పుస్తకాలపై శ్రద్దపెట్టాలి. ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇందులో 88 ప్రశ్నలు ఉంటాయి. వాటికి 44 మార్కులు ఇస్తారు. ఇక మిగిలింది నాలుగో విభాగం. ఇందులో టీచింగ్ మెథడాలజీ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 32 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 16 మార్కులు ఇస్తారు. ఇందులో పది అధ్యాయాలు ఉంటాయి.

CSB Recruitment 2022: సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. 


ఉపాధ్యాయుల స్వభావం, బోధన ఎలా ఉండాలి, చరిత్ర, వాటి అభివృద్ది, బోధన ఉద్దేశాలు, విలువలు ఎలా పెంపొందించాలి, బోధన లక్ష్యాలు, ప్రాజెక్టు పద్దతి, ల్యాబ్ లో ఏవిధంగా బోధించాలి, బోధన ప్రణాళిక, పాఠశాలలో ఉండే గ్రంథాలయం ఇలాంటి విషయాలపై శ్రద్ద వహించాలి. నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానానికి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలని, పాత ప్రశ్న పత్రాలను కూడా పరిశీలించాలని సూచించారు. తెలుగు అకాడమీ వారు పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పుస్తకాలను చదివితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు పక్కా ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు ఉంటాయని, సమాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే విజయం తధ్యమని పేర్కొన్నారు.

First published:

Tags: Career and Courses, JOBS, Preparation, School assistant, Tips

ఉత్తమ కథలు