హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC 6 Notifications: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి 6 నోటిఫికేషన్లు.. జనవరి 3 నుంచి పరీక్షలు.. వివరాలిలా..

TSPSC 6 Notifications: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి 6 నోటిఫికేషన్లు.. జనవరి 3 నుంచి పరీక్షలు.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSPSC 6 Notifications: తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ(Finance Ministry) నుంచి అనుమతులు వస్తున్నాయి. తాజాగా గ్రూప్ 4 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ(Finance Ministry) నుంచి అనుమతులు వస్తున్నాయి. తాజాగా గ్రూప్ 4 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ నెలాఖరులోపు గురుకుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక.. అదే విధంగా టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి కూడా నోటిఫికేషన్లు(Notifications) విడుదల అవుతున్నాయి. ఇలా ఇటీవల దాదాపు 6 నోటిఫికేషన్లను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. వీటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. జనవరి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఏ నోటిఫికేషన్ కు ఎంత మంది దరఖాస్తులు చేశారు.. ? పరీక్ష తేదీలు ఎప్పుడు.. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

Telangana Gurukul Notification: భారీగా పెరిగిన గురుకుల పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

1. ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు..

టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి ఇటీవల మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మహిళలకు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1 లో మొత్తం 17 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 2 లో మొత్తం 06 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 చెల్లించనున్నారు. మొత్తం ఈ పోస్టులకు 19,814 మంది దరఖాస్తులు చేశారు. పరీక్ష తేదీని జనవరి 03, 2023గా అధికారులు నిర్ణయించారు.

2. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులు..

ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. మొత్తం 181 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక ఈ 181 పోస్టులకు మొత్తం 26,752 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని జనవరి 08, 2023గా అధికారులు నిర్ణయించారు.

3. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు.. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) 1547 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్లికేషన్స్(Applications) అనేవి సెప్టెంబర్ 22 నుంచి ... అక్టోబర్ 14, 2022 వరకు స్వీకరించారు. మొత్తం ఈ పోస్టులకు 81,871 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష తేదీ జనవరి 22, 2023గా అధికారులు నిర్ణయించారు.

4. అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) ఉద్యోగాలు..

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఇలా వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మొత్తం 74,488 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్ష తేదీ ఫిబ్రవరి 12, 2023గా అధికారులు వెబ్ నోట్ ద్వారా వెల్లడించారు.

5. డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు..

టీఎస్పీఎస్సీ నుంచి వెల్లడైన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ) ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 1,06,263 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీని ఖరారు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26 ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెబ్ నోటీస్ ద్వారా టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

Jobs In ESIC: రూ.78,800 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు .. హైదరాబాద్ లో నియామకాలు..

6. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాలు ..

మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఈ పోస్టులకు 33,342మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మార్చి 12, 2023గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అధికారికంగా వెల్లడి కాలేదు.

First published:

Tags: Aeee, JOBS, TSPSC, Tspsc jobs

ఉత్తమ కథలు