హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Learning Portal: విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం కొత్త మాడ్యూల్‌.. ఏఐసీటీఈ ల‌ర్నింగ్ పోర్ట‌ల్

Learning Portal: విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం కొత్త మాడ్యూల్‌.. ఏఐసీటీఈ ల‌ర్నింగ్ పోర్ట‌ల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Learning Portal | AICTE ఉన్నత విద్యను పటిష్టం చేయడంలో భాగంగా సరికొత్త లెర్నింగ్ పోర్టల్​​ను ప్రారంభించింది. పరక్​ (PARAKH) పేరుతో విద్యార్థుల కోసం లెర్నింగ్​ పోర్టల్​​ను ఆవిష్కరించింది. దీని ద్వారా విద్యార్థుల లెర్నింగ్​ ఎబిలిటీని సులభంగా అంచనా వేయనుంది.

ఇంకా చదవండి ...

ఆల్​ ఇండియా టెక్నికల్​ ఎడ్యుకేషన్​ (AICTE) ఉన్నత విద్యను పటిష్టం చేయడంలో భాగంగా సరికొత్త లెర్నింగ్ పోర్టల్​​ను ప్రారంభించింది. పరక్​ (PARAKH) పేరుతో విద్యార్థుల కోసం లెర్నింగ్​ పోర్టల్​​ను ఆవిష్కరించింది. దీని ద్వారా విద్యార్థుల లెర్నింగ్​ ఎబిలిటీని సులభంగా అంచనా వేయనుంది. తద్వారా, విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం కొత్త మాడ్యూళ్లను రూపొందించనంది. నేషనల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ (NPIU), స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఉమ్మడి సిఫార్సుల ఆధారంగా స్టూడెంట్స్ లెర్నింగ్ అసెస్‌మెంట్ (PARAKH) ప్రోగ్రామ్ పోర్టల్​ను ప్రారంభించింది. ఆయా విద్యార్థుల కోసం https://aslap.aicte-india.org/ వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చినట్లు ఏఐసీటీఈ ప్రకటించింది. ఈ పోర్టల్ పాఠశాల విద్యార్థులు, అధ్యాపకుల మూల్యాంకనాలను నిర్వహిస్తుంది.

CUET 2022: సీయూఈటీకి ఆ స్టేట్స్ నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు.. ఈ రాష్ట్ర‌ల్లో అంతంతే..

పరక్ పోర్టల్లో 1,45,000 కంటే ఎక్కువ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లను ప్రాక్టీస్ కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇవి విద్యార్థులు, గ్రాడ్యుయేట్ల లెర్నింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఆప్టిట్యూడ్, ఎమర్జింగ్ ఏరియాలు, ఉన్నత స్థాయి ఆలోచనా నైపుణ్యాలపై మల్టిపుల్ క్వశ్చన్లు ఉంటాయి.

1,45,000 కు పైగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు..

ఇక, ఉపాధ్యాయుల నాణ్యతను పెంచేందుకు గతంలో తీసుకొచ్చిన నేషనల్​ ఇనిషియేటివ్​ ఫర్​ టెక్నికల్ టీచర్​ ట్రైనింగ్​ (ఎన్​ఐటీటీటీ)లో అనేక మార్పులు చేసింది. ఐదేళ్ల కంటే తక్కువ టీచింగ్​ ఎక్స్​పీరియన్స్​ గల ఉపాధ్యాయుల కోసం నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్​ టీచర్స్​ ట్రైనింగ్​ (NITTT) పరిధిని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. పైలట్ ప్రోగ్రామ్‌లో భాగంగా 80,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. వారు 55,000 కంటే ఎక్కువ అసెస్​మెంట్లలో పాల్గొనే అవకాశం కల్పించింది. మరోవైపు, 1,200 మంది అధ్యాపకులకు కూడా అసెస్​మెంట్​లో చేరే అవకాశం కల్పించింది.

Jobs in Telangana: సింగ‌రేణిలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. మూడు రోజులు ఇంట‌ర్వ్యూలు

ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఎన్​ఐటీటీటీ ప్రోగ్రామ్​..

కొత్తగా పునరుద్ధరించిన NITTT టీచర్​ ట్రైనింగ్​ ప్రోగ్రామ్​లో భాగంగా, ఉపాధ్యాయులకు ఇండస్ట్రియల్​ ట్రైనింగ్, సెమిస్టర్ ఆధారిత మెంటర్‌షిప్‌ను అందిస్తోంది. NITTT అనేది ప్రపంచవ్యాప్తంగా మొదటి నిర్మాణాత్మక టీచర్​ ట్రైనింగ్​ ప్రోగ్రామ్​. ఇది ఐదు సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంది. దేశంలో సాంకేతిక విద్య, నాణ్యతను ప్రోత్సహించడం కోసం ఏఐసీటీఈ దీన్ని ప్రారంభించింది. NITTT నుండి ఇప్పటివరకు దాదాపు 47,015 మంది ఉపాధ్యాయులు ప్రయోజనం పొందారు. ఉపాధ్యాయులు ఇప్పుడు ఎన్​ఐటీటీటీలోని 12 మాడ్యూళ్లలో కనీసం 6 మాడ్యూళ్లలో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి.

First published:

Tags: Career and Courses, EDUCATION, Online Education