Home /News /jobs /

LEARN FROM HOME DETAILS OF ONLINE COURSES THAT OFFER EMPLOYMENT OPPORTUNITIES EVK

Online Course : ఇంటి నుంచే చ‌దివేయండి.. ఉపాధి అవ‌కాశ‌లిచ్చే ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Online Courses : కోవిడ్ త‌రువాత విద్యావిధానంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఆన్‌లైన్ విద్య సౌల‌భ్యం అంద‌రికీ అర్థం అయ్యింది. ప్ర‌ముఖ కంపెనీలు, యూనివ‌ర్సీటీలు (Universities) ఆన్‌లైన్ కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. ప్ర‌స్తుతం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే ఆన్‌లైన్ కోర్సుల‌ను ఇంటి నుంచే నేర్చుకొనే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. వాటి వివ‌రాలు తెలుసుకోండి

ఇంకా చదవండి ...
  ప్రస్తుత ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్స్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌ (Cloud Computing) ఒకటిగా నిలుస్తోంది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో.. భవిష్యత్తులో మనుషుల అవసరాలకు తగినట్లుగా సాంకేతికతను తీసుకురావడంలో క్లౌడ్ కంప్యూటింగ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం ద్వారా అపరిమితమైన ఉద్యోగావకాశాలు పొందొచ్చు. తాజాగా అమెజాన్ వెబ్ (Amazon Web) సర్వీసెస్ (AWS) కూడా క్లౌడ్ కంప్యూటింగ్‌ ప్రాముఖ్యతను నిరుద్యోగులకు తెలియజేసేందుకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఎడబ్ల్యుఎస్ (AWS) రీ/స్టార్ట్ ప్రోగ్రాంలో భాగంగా 12 వారాల క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఉచితంగా అందిస్తున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు ఎలాంటి టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌/స్కిల్స్ అవసరం లేదు.

   కోర్సుకు అర్హతలు

  1. అభ్యర్థులు 12 వారాల కోర్స్‌ వ్యవధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు హాజరు కావడానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి.

  2. ట్రైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఫుల్ టైం జాబ్ చేయగలగాలి.

  3. దరఖాస్తుదారుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ లో కెరీర్ ని తప్పకుండా ప్రారంభించాలనే ఆసక్తి ఉండాలి.

  TCS Careers : "టీసీఎస్ పిలుస్తోంది".. నిరుద్యోగుల‌కు ఉచిత శిక్ష‌ణ‌.. ఉపాధి అవ‌కాశాలు


  4. అభ్యర్థులు హైస్కూల్ డిప్లొమా లేదా జనరల్ ఎక్వివలెన్సీ డిప్లొమా (GED) కలిగి ఉండాలి.

  అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్.. పార్టిసిపెంట్లను క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ పరీక్షకు సిద్ధం చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఖర్చులను కూడా భరిస్తుంది. ఇక్కడ నేర్చుకున్న క్లౌడ్ స్కిల్స్ సర్టిఫికేషన్ ఎక్కడైనా సరే వాలీడ్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చెన్నై, కోల్కతా, ముంబై, పూణే, తిరువనంతపురం సిటీల నుంచి నిర్వహిస్తారు. ఎడ్యూబ్రిడ్జి లెర్నింగ్, ఎడ్యూజాబ్స్ అకాడమీ వంటి ఐదు స్థానిక విద్యా సంస్థలతో కలిసి వర్చువల్ ట్రైనింగ్ అందించనున్నారు.

  ఈ కోర్సు గురించి మరిన్ని వివరాల కోసం https://aws.amazon.com/training/restart/ లింక్ ను విజిట్ చేయవచ్చు.

  IIIT ఢిల్లీలో కంప్యూట‌ర్ సైన్స్‌ ఉపాధ్యాయుల‌కు ప్ర‌త్యేక కోర్సు


  సైన్స్‌ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indraprastha Institute of Information Technology) ప్రొఫెసర్‌ల కోసం కంప్యూటర్ సైన్స్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ‌ర్చువ‌ల్ విధానంలో యూనివ‌ర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సు బీఈ/ బీటెక్ అండ్ నాన్- ఇంజ‌నీరింగ్  విభాగాలు బీఎస్సీ/ బీసీఏ / ఎంసీఏ నేప‌థ్యాల నుంచి వ‌చ్చివారు చేసేందుకు రూపొందించిన స‌ర్టిఫికెట్ ప్రోగ్రామ్ (Certificate Program) ముఖ్యంగా కంప్యూట‌ర్ సైన్స్ (Computer Science) విభాగాల్లో ఉపాధ్యాయులు బోధ‌నా సామర్థ్యాలు మెరుగు ప‌ర్చుకొనేందుకు రూపొందించిన కోర్సుగా యూనివ‌ర్సిటీ తెలిపింది. ఈ కోర్సు చేసేందుక ఇత‌ర యూనివ‌ర్సిటీలు త‌మ అధ్యాప‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. అంతే కాకుండా అసోసియేష‌న్ ఫ‌ర్ కంప్యూటింగ్ మిష‌న‌రీ (Association for Computing Machinery) ఈ కోర్సు చేసేందుకు అధ్యాప‌కుల‌ను పాక్షిక‌ ఆర్థిక చేయూత అందించ‌నుంది.

  వారానికి 6 నుంచి 8 గంట‌ల బోధ‌న‌..

  • ఈ కోర్సు బోధించేందుకు ఆయా రంగాల్లో స్పెష‌లిస్టుల‌ను ఎంపిక చేసి బోధ‌న అందించ‌స్తారు. ముఖ్యంగా ఏఐసీటీ (AICTE) సెల‌బ‌స్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పాఠ్యాంశాల‌ను బోధిస్తున్నారు.


  SSC Recruitment 2021 : స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్‌లో 3,261 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే గ‌డువు
  • ఈ మాడ్యుల్ బోధ‌న‌కు ఐఐటీ, ఐఐఐటీ విద్యావేత్త‌ల‌ను నియమించ‌నున్నారు. ఈ కోర్సు మొద‌టి మాడ్యూల్ జ‌న‌వ‌రి 2022న ప్రారంభ‌మ‌వుతుంది. ఈ కోర్సు రెగ్యులర్ సెమిస్టర్‌లో పాఠ్యాంశాలు ఆన్‌లైన్ మాడ్యూల్‌ (Online Module)లను కలిగి ఉన్నందున ఫ్యాకల్టీ ఎప్పుడైనా సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు.

  • -ప్రతి వారం, ప్రతి వారం దాదాపు 5 నుంచి 6 గంటల మొత్తం ప్రయత్నం కోసం, కొన్ని వారపు ప్రాక్టీస్ పనితో పాటు ఒక సింగిల్ సెషన్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత హాజరైనవారు సర్టిఫికెట్ పొందుతారు.

  • ఈ కోర్సులో ప్రతీ మాడ్యూల్ ధర రూ. 10,000 అద‌నంగా జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఫీజులోనే ఆన్‌లైన్ క్లాస్‌లు, మెటీరియ‌ల్ (Material) అందిస్తారు.

  • మాడ్యూల్ పూర్తి చేసుకొన్న వారు వారి డిపార్ట్‌మెంట్‌/ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నిమినేట్ చేయ‌బ‌డ‌తారు. వారానిఇక 6 నుంచి 8 గంట‌ల పాటు కోర్సు విధానాన్ని నిర్ణ‌యిస్తారు.


  ట్రిపుల్​ఐటీ హైదరాబాద్​లో కొత్త కోర్సు..


  మారుతున్న టెక్నాలజీ, మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా హైదరాబాద్​లోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (ట్రిపుల్​ఐటీ) సరికొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్​ను​ ప్రారంభించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్​ అధికారిక వెబ్‌సైట్ www.pdm.iiit.ac.in ద్వారా నవంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.​ టెక్నాలజిస్ట్​లు, ప్రొడక్ట్ డిజైనర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, స్టార్టప్ ఫౌండర్లు, ఎంటర్​ప్రెన్యూర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సును ఆవిష్కరించింది.

  ఈ ప్రోగ్రామ్ కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌ (Startup) లు లేదా కొత్త ఐటీ కొలువుల సృష్టికి దారి తీస్తుంది. ఎంటెక్ ప్రోగ్రామ్‌ మొదటి సంవత్సరంలో నూతన టెక్నాలజీపై అవగాహన, టెక్నాలజీ కన్వర్జెన్స్, డిజైన్, మార్కెట్లు & బిజినెస్, ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్​పైలోతైన అవగాహన కల్పిస్తారు. ఇక, రెండో సంవత్సరంలో క్రియేటింగ్ ప్రొడక్ట్స్, డీప్​టెక్నాలజీస్​లోకి ఐడియాలు ట్రాన్స్​లేట్​ చేసుకోవడం, ​ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మార్కెట్‌ వంటి సబ్జెక్ట్​లపై అవగాహన కల్పిస్తారు.

  ఇలా దరఖాస్తు చేసుకోండి..
  Step 1 : ముందుగా www.pdm.iiit.ac.in క్లిక్ చేసి వెబ్ సైట్ కు వెళ్లాలి.
  Step 2 : అందులో టాప్ లో అడ్మిషన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయాలి.
  Step 3 : కొత్త పేజీ ఓ పెన్ అయిన తర్వాత బాటమ్ లో అప్లై(Apply)అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  Step 3 : తదనంతరం New Users click here to register పైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: EDUCATION, Iiit hyderabad, New course, Online Education

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు