హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Learn English: ఇంగ్లీష్ ఇడియమ్స్ అంటే ఏంటి..? వీటిని ఎప్పుడు వాడాలి..? ఉదాహరణలు చూడండి..

Learn English: ఇంగ్లీష్ ఇడియమ్స్ అంటే ఏంటి..? వీటిని ఎప్పుడు వాడాలి..? ఉదాహరణలు చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Learn English: ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు, నుడికారాలు లేదా వాడుక అని అర్థం. ఈ ఇడియమ్స్‌లోని పదాలకు.. ఆ పదాల సమూహం (Group of words) మొత్తం అర్థానికి ఏ విధమైన సంబంధం ఉండదు. డైలీ లైఫ్‌ సంభాషణల్లో వాడగల బెస్ట్ అండ్ సింపుల్ ఇడియమ్స్ ఏవో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇంగ్లీష్ గ్రామర్ (English Grammar) నేర్చుకున్నవారు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ వేరే లెవెల్‌కి తీసుకెళ్లాలంటే కొత్తగా ఫ్రెజెస్ (Phrases), ఇడియమ్స్ (Idioms) నేర్చుకోవాలి. ముఖ్యంగా ఎవరితోనైనా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇడియమ్స్‌ వాడితేనే కమ్యూనికేషన్ స్టైల్ మెరుగుపడుతుంది. అవతల వ్యక్తికి మీరు చెప్పే మాటలు వినాలని అనిపిస్తుంది. అలాగే ఇంగ్లీష్ భాషలో మీకు బాగా పట్టుందని ఎదుటివారు ఇంప్రెస్ అవుతారు. ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు, నుడికారాలు లేదా వాడుక అని అర్థం. ఈ ఇడియమ్స్‌లోని పదాలకు.. ఆ పదాల సమూహం (Group of words) మొత్తం అర్థానికి ఏ విధమైన సంబంధం ఉండదు. అంటే ఒక ఇడియమ్‌లోని పదాలతో సంబంధం లేకుండా అసలైన అర్థం వేరే ఉంటుంది. మరి మీరు మీ డైలీ లైఫ్‌ సంభాషణల్లో వాడగల బెస్ట్ అండ్ సింపుల్ ఇడియమ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.1. In A Fix
ఇన్ ఏ ఫిక్స్ అనే ఇడియమ్‌కు కష్టమైన లేదా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్లు అర్థం. అలాగే సందిగ్ధంలో ఉన్నామని చెప్పేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
- ఐయామ్ ఇన్ ఏ ఫిక్స్‌. ఐ డోంట్ నో వాట్ టు డు (నేను సందిగ్ధంలో ఉన్నాను. నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు)
2. Easier Said Than Done
ఈజీయర్ సెడ్ దాన్ డన్ అనే ఇడియమ్‌ను.. ఏదైనా చేయడం కంటే చెప్పడం సులభం అని చెప్పేందుకు వాడతాం.
లెర్నింగ్ ఇంగ్లీష్ ఇజ్‌ ఈజీయర్ సెడ్ దాన్ డన్ (ఇంగ్లీష్ నేర్చుకుంటామని చెప్పడం సులభమే కానీ నేర్చుకోవడం కష్టం)
3. Get On Someone's Nerves
గెట్ ఆన్ సమ్‌వన్స్‌ నర్వ్స్‌ అంటే ఒకరిని బాగా ఇబ్బంది పెట్టడం, చిరాకు/కోపం తెప్పించేలా చేయడం అని అర్థం వస్తుంది.
అతడు నాకు బాగా చికాకు పుట్టిస్తున్నాడు. (He is getting on my nerves.)


4. Get Cross with Somebody
దీనికి కోపం తెచ్చుకోవడం అని అర్థం.
కారణం లేకుండా నా మీద కోపం తెచ్చుకుంటున్నావు. (You Are Getting Cross With Me For Nothing)
5. Strike The Iron When It Is Hot
ఏదైనా చేయడానికి ఇంకా మంచి అవకాశం ఉన్నప్పుడు వెంటనే చేయాలని చెప్పే సందర్భంలో దీనిని వాడతారు.
ఇది కూడా చదవండి : బిగ్ అలర్ట్.. నీట్-పీజీ, FMGE పరీక్షల విలీనం.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌..
6. True To One's Word
చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటం అనేది ఈ ఇడియమ్‌కు అర్థం. లేదా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం.
అతను తన మాటకు కట్టుబడి ఉన్నాడు. (He's true to his words)
7. End In Smoke
కచ్చితమైన లేదా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. దీనికి వృథా కావడం అనే అర్థం కూడా వస్తుంది.
అతని ఆశలన్నీ అడియాశలయ్యాయి. (All his hopes ended in smoke)
8. Out of my control
కంట్రోల్ చేయలేని లేదా నిర్వహించలేని స్థితిని వర్ణించేటప్పుడు ఔట్ ఆఫ్ మై కంట్రోల్ అని అంటుంటారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, English medium, JOBS

ఉత్తమ కథలు