హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Online Course: ఇంటి నుంచే చ‌దివేయండి.. టాప్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు

Online Course: ఇంటి నుంచే చ‌దివేయండి.. టాప్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌పంచంలోని ఉత్త‌మ యూనివ‌ర్సిటీల్లో ఒక్క‌టైన అమెరికాలోని హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం (Harvard University) విద్యార్థుల‌కు స‌రికొత్త అవ‌కాశం ఇస్తోంది. ప్రొగ్రామ‌ర్‌లు, కంప్యూట‌ర్ సైన్స్‌ స్టూడెంట్స్‌కి ఉచిత ఆన్‌లైన్ కోర్సు (Online Course) అందిస్తుంది. వాటి వివ‌రాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ప్ర‌పంచంలోని ఉత్త‌మ యూనివ‌ర్సిటీల్లో ఒక్క‌టైన అమెరికా (America) లోని హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం (Harvard University) విద్యార్థుల‌కు స‌రికొత్త అవ‌కాశం ఇస్తోంది. ప్రొగ్రామ‌ర్‌లు, కంప్యూట‌ర్ సైన్స్‌ స్టూడెంట్స్‌కి ఉచిత ఆన్‌లైన్ కోర్సు (Online Course) అందిస్తుంది. ముఖ్యంగా కంప్యూట‌ర్ ప్రొగ్రామింగ్ డొమైన్ (computer programming domain) శిక్ష‌ణ అందించ‌డంలో విశ్వ‌విద్యాల‌యం ప్ర‌సిద్ధి చెందింది. విద్యార్థుల‌కు మెరుగైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాల‌ (Programming Skills) ను అభివృద్ధి చేయ‌డంలో టాప్ లెవ‌ల్ అధ్యాప‌కుల‌తో శిక్ష‌ణ అందించ‌నుంది. విద్యార్థుల కెరీర్‌ (Career)కు ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని యూనివ‌ర్సిటీ చెబుతుంది. ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొనే వారు అధికారిక వెబ్‌సైట్‌ https://online-learning.harvard.edu/catalog/free ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

హ‌ర్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలోని CS50 లోని విభాగం ఈ కొత్త కోర్సుల‌ను ఉచితంగా అందిస్తోంది. కంప్యూటర్ సైన్స్‌పై ఆన్-క్యాంపస్ అండ్ ఆన్‌లైన్ ఇండ‌క్ష‌న‌రీ కోర్సుల‌ను అందిస్తోంది. ఆస‌క్తిగ‌ల వారికి యూనివ‌ర్సిటీ అందిస్తున్న టాప్ ఐదు ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకోండి.

IIT Madras : ఐఐటీలో డేటా సైన్స్ కోర్సు చేయాల‌నుకొంటున్నారా.. అయితే ద‌ర‌ఖాస్తు చేసుకోండి


అండర్స్టాండింగ్ టెక్నాలజీ (Understanding Technology)..

ఈ కోర్సు రోజువారీగా సాంకేతికతను ఉపయోగించే వ్యక్తుల కోసం రూపొందించబడింది. ఈ కోర్సు ఆరు వారాలు ఉంటుంది. మ‌నం జీవితంలో ఉప‌యోగించే సాంకేతి ప‌రిజ్ఞానాన్ని ఎంత మెరుగ్గా ఉప‌యోగించుకోవ‌చ్చో నేర్పుతారు. ఈ ప‌రిజ్ఞానం వెనుక ఉన్న సైన్స్ వివ‌రాల‌ను అంద‌జేస్తారు. ఈ కోర్సుతోపాటు హార్డ్‌వేర్, ఇంటర్నెట్, మల్టీమీడియా, సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ అండ్‌ వెబ్ డెవలప్‌మెంట్‌పై ఉపన్యాసాలు కూడా ఉంటాయి.

ఇండ‌క్ష‌న్ టు ప్రొగ్రామింగ్ విత్ స్క్రాచ్ (Introduction to Programming with Scratch)

ఈ కోర్సును విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్- స్క్రాచ్ MIT మీడియా ల్యాబ్‌లో రూపొందించారు. ఇది వారి సొంత‌ యానిమేషన్‌లు, ఆటలు, ఇంటరాక్టివ్ ఆర్ట్‌, కథలను రూపొందించడానికి ముందస్తు ప్రోగ్రామింగ్ అనుభవం లేని విద్యార్ధులను ప‌రిజ్ఞానం అందించ‌డంలో సహాయపడుతుంది. స్క్రాచ్‌ని ఉపయోగించి, ప్రోగ్రామింగ్‌తోపాటు సాంప్రదాయ టెక్స్ట్-ఆధారిత భాషల (జావా (JAVA) అండ్‌ పైథాన్ (Python) వంటివి) ప్రాథమికాలను నేర్చుకోవడంలో విద్యార్థులను ప్రోత్స‌హించ‌డం ఈ కోర్సు ల‌క్ష్యం.

IBPS Exams: ఐబీపీఎస్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే టిప్స్ పాటించండి


మూడు వారాల కోర్సులో ప్రోగ్రామింగ్ భాష యొక్క ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్‌లో తదుపరి కోర్సుల కోసం విద్యార్థులను సిద్ధం చేస్తుంది.

ఇండ‌క్ష‌న్ టు కంప్యూట‌ర్ సైన్స్ (Introduction to Computer Science)..

ఇది ప్రారంభ‌స్థాయి కోర్సు. ఈ కోర్సు కాల ప‌రిమితి 11 వారాలు. కంప్యూట‌ర్ ఆల్గారితం అర్థం చేసుకోవ‌డం.. కంప్యూట‌ర్ స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిష్క‌రించేనైపుణ్యాన్ని ఈ కోర్సులో అందిస్తారు.

Internship: ఫ్రెషర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కోసం టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ వివ‌రాలు


ఇది విద్యార్థులు అల్గారిథమిక్‌గా ఆలోచించడానికి మరియు కంప్యూటర్ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి వీలు కల్పించే ఒక ఎంట్రీ-లెవల్ కోర్సు. కోర్సులో సంగ్రహణ (abstraction), అల్గోరిథంలు, డేటా నిర్మాణాలు, ఎన్‌క్యాప్సులేషన్, వనరుల నిర్వహణ, భద్రత, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ మరియు వెబ్ డెవలప్‌మెంట్ వంటి అంశాలు ఉంటాయి.

ఇండ‌క్ష‌న్ టు గేమ్ డెవలప్‌మెంట్ (Introduction to Game Development)..

2D మరియు 3D ఇంటరాక్టివ్ గేమ్‌ల రూపకల్పనతోపాటు అందులో మెరుగైన నైపుణ్యాన్ని పొంద‌డానికి ఈ కోర్సు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ కోర్సు12 వారాల సుదీర్ఘ కోర్సు. ఈ కోర్సుకు చెప్పే ఉపన్యాసాలు, ప్రాజెక్ట్‌ల ద్వారా 2D అండ్‌ 3D గ్రాఫిక్స్‌లో నైపుణ్యంతోపాటు యానిమేషన్ సూత్రాల మెరుగ్గా నేర్చుకోవ‌డానికి అభ్యాసకులకు అవ‌కాశం ఉంటుంది.

ఇండ‌క్ష‌న్ టు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (Introduction to Artificial Intelligence with Python)

ఈ కోర్సు అభ్యాసకులకు అల్గారిథమ్‌లతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యొక్క ఆధునిక భావనలను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ కోర్సు 7 వారాలు ఉంటుంది. ఈ కోర్సులో ప్ర‌త్యేక ఏంటంటే విద్యార్థులు హ్యాండ్-ఆన్ ప్రాజెక్ట్‌ల ద్వారా యంత్రాలలో AI ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు.

First published:

Tags: New course, Online classes, Online Education

ఉత్తమ కథలు