Online Courses: ఇంట్లోనే కూర్చొని టాప్ యూనివర్సిటీ కోర్సులు నేర్చుకోండి... సులువుగా జాబ్​ కొట్టేయండి

Online Courses: ఇంట్లోనే కూర్చొని టాప్ యూనివర్సిటీ కోర్సులు నేర్చుకోండి... సులువుగా జాబ్​ కొట్టేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Online Courses | మీరు ఆన్‌లైన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారా? గూగుల్, హార్వర్డ్ సహా ప్రముఖ సంస్థల నుంచి ఆన్‌లైన్‌లోనే ఈ కోర్సులు నేర్చుకోవచ్చు.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే కాలంలో అన్ని రంగాల్లోనూ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ హవా కొనసాగనుంది. దీంతో ఈ కోర్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే, పలు ఇంజినీరింగ్​ కాలేజీలు తమ కోర్సుల్లో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, మెషిన్​ లెర్నింగ్​ వంటి కోర్సులను అందిస్తున్నాయి. అయితే, పెద్ద మొత్తంలో వెచ్చించే స్థోమత లేని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా షార్ట్​టర్మ్​ ఆన్​లైన్​ కోర్సులను అందిస్తున్నాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ) నుండి హార్వర్డ్​ యూనివర్సిటీ వరకు ​విద్యార్థులు, ఐటీ ఎక్స్​పర్ట్స్​కు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. వీటిని ఇంట్లోనే కూర్చొని ఆన్​లైన్​ ద్వారా నేర్చుకోవచ్చు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏ ఏ ఆన్​లైన్​ కోర్సులను అందిస్తున్నాయో చూద్దాం.

-AI/ML తో డిజిటల్​ ట్రాన్స్​ఫర్మేషన్


ఈ కోర్సును గూగుల్ క్లౌడ్ అందిస్తోంది. ఇది ఒక ప్రారంభ స్థాయి కోర్సు. ఇది సుమారు రెండు నెలల వ్యవధి గల కోర్సు. కోర్సులో భాగంగా వారానికి ఐదు గంటల పాటు ఆన్​లైన్​లో బోధిస్తారు. మనకు అనువైన సమయంలోనే ఈ క్లాసును వినే అవకాశం ఉంటుంది. అయితే హ్యాండ్స్​ ఆన్​ ఎక్స్​పీరియన్స్​ కోసం ప్రాజెక్ట్ వర్క్​ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సర్టిఫికేట్​ అందజేస్తారు. ఈ కోర్సు నెర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఐటీ నిపుణులు ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు.

Online Courses: ఆన్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు అందించే వెబ్‌సైట్స్ ఇవే

Railway Course: రైల్వే జాబ్ కోసం ఈ కోర్సులు చేయండి

AI, మెషిన్ లెర్నింగ్ మాస్టర్​ ట్రాక్​ సర్టిఫికేట్


ఈ కోర్సును ప్రతిష్టాత్మక అరిజోనా స్టేట్ యూనివర్సిటీ కోర్సెరా ద్వారా అందిస్తుంది. మే 17 న కొత్త సెషన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ కోర్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇది 6-9 నెలల లాంగ్ టర్మ్​ కోర్సు. కోర్సులో భాగంగా మీరు ఐదు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. క్లాసిక్​ లాజిక్​, క్యాలుక్యులస్​, ఆల్గోరిథం, ప్రాబబిలిటీ, ఆల్​జీబ్రా వంటి ప్రాథమిక అంశాలను నేర్చుకుంటారు. ఇది పూర్తి స్థాయి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ప్రోగ్రామ్. ఈ కోర్సు నేర్చుకోవడానికి అభ్యర్థులు 4500 డాలర్లు (దాదాపు రూ. 3,30,000) చెల్లించాలి.

ఐఐటీ మద్రాస్​ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్


ఈ ఆన్‌లైన్ కోర్సును ఐఐటి -మద్రాస్ అందిస్తుంది. ఇది 12 వారాల కోర్సు. యూజీ, పీజీ చేసే విద్యార్థులెవరైనా ఈ కోర్సులో నమోదు చేసుకోవచ్చు. కోర్సులో భాగంగా మీరు ఫార్మాలిజాలను, అనుబంధ అల్గారిథమ్‌లపై అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు భారత ప్రభుత్వ ఆన్‌లైన్ వేదిక అయిన స్వయం ద్వారా లభిస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. కోర్సులో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు 12 అసైన్‌మెంట్‌లలో కనీసం ఎనిమిది పూర్తి చేయాలి అలాగే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

Work From Home Jobs: ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించండి ఇలా

Work From Home Jobs: నెలకు రూ.30,000 సంపాదించండి... వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవే

కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్


ఈ కోర్సును ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సు వ్యవధి 12 వారాల పాటు వారానికి 6- నుంచి 18 గంటల పాటు ఉంటుంది. లేదా ఏడు వారాల పాటు వారానికి 10 నుంచి- 30 గంటలు పాటు ఉంటుంది. కోర్సులో భాగంగా మీరు పైథాన్‌తో పాటు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ను నేర్చుకుంటారు. కేవలం రూ.25,998 ఫీజుతో ఎడ్ఎక్స్ సహకారంతో ఈ కోర్సును హార్వర్డ్​ యూనివర్సిటీ అందిస్తుంది.

IBM అప్లైడ్ AI ప్రొఫెషనల్ సర్టిఫికేట్


ఇది బిగినర్స్​ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్​లైన్​ ప్రోగ్రామ్​. దీన్ని ఐబీఎం సంస్థ అందిస్తోంది. కోర్సులో భాగంగా మీరు పైథాన్ నేర్చుకుంటారు. చాట్‌బోట్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఐబీఎం వాట్సన్‌ వంటి వాటిపై పట్టు సాధిస్తారు. ఇది ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​ కోర్సెరా సహకారంతో అందించబడుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత,మీరు కోర్సెరా నుండి ప్రొఫెషనల్ సర్టిఫికేట్, ఐబిఎం నుండి డిజిటల్ బ్యాడ్జ్ ని పొందుతారు.
Published by:Santhosh Kumar S
First published: