మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్.. లా స్టూడెంట్స్(Law Students), గ్రాడ్యుయేట్ల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను(Internship Programmes) ఆఫర్ చేస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ legalaffairs.gov.in/internship ద్వారా దరఖాస్తు(Application) చేసుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమై.. వచ్చే ఏడాది మే(May) నెలలో ఈ ప్రోగ్రామ్స్ ముగియనున్నాయి. ఈ ఇంటర్న్‌షిప్ కు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు జూన్ 1న ట్విట్టర్‌లో(Twitter) వెల్లడించారు.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలోని(Chennai) న్యాయ శాఖ కార్యాలయాల్లో పని చేయడానికి ఈ ఇంటర్న్‌షిప్ ఒక గొప్ప అవకాశమని మంత్రి ట్వీట్ చేశారు. ఈ ఇంటర్న్‌షిప్ కోసం యువ ప్రతిభావంతులైన న్యాయవాదులు gov.in/internship ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఉంటుందని కేంద్ర న్యాయ శాఖ అధికారిక నోటీసులో పేర్కొంది. అయితే స్లాట్ లభ్యత, కాంపిటెంట్ అథారిటీ ఆమోదం ఈ ప్రక్రియలో కీలకం కానుంది. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం SMS, ఇమెయిల్ ద్వారా పంపనున్నారు. ఒక నెలలో గరిష్టంగా 10 నుంచి 30 మంది అభ్యర్థులను మాత్రమే ఇంటర్న్‌షిప్ కోసం అనుమతించనున్నారు. ఇది పుల్ టైమ్ ఇంటర్న్‌షిప్.. విద్యార్థులు భౌతికంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులు మరే ఇతర కోర్సు చేయకూడదు.
A great opportunity to work at the Department of Legal Affairs, as it introduces #internships for law students for offices in Delhi, Mumbai, Bengaluru, Kolkata and Chennai.
I recommend young talent to apply for this internship at https://t.co/Gy4AQBUOwm pic.twitter.com/PuUOFpK8iK
— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2022
* అర్హత ప్రమాణాలు
మూడేళ్ల డిగ్రీ కోర్సులో 2 లేదా 3వ సంవత్సరం చదువుతున్న భారతీయ విద్యార్థులు లేదా ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల/లా స్కూల్/యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ కోర్సుకు సంబంధించి 3, 4, లేదా 5వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల లేదా లా స్కూల్ లేదా యూనివర్సిటీ నుండి LLB కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
* దరఖాస్తు విధానం
స్టెప్-1: . డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులు ముందుగా తమ దరఖాస్తును https://legalaffairs.gov.in/internship/form.php లింక్ ద్వారా పూరించాలి.
స్టెప్-2: చదువుతున్న కళాశాల/యూనివర్సిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌తో సహా సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
మరోవైపు.. కంటెంట్ రైటర్ పోస్టుల కోసం డిజిలాకర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇంగ్లీష్, కమ్యూనికేషన్, లింగ్విస్టిక్స్, ఇంటర్నేషనల్ స్టడీస్ లేదా సంబంధిత ఫీల్డ్ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన ఇంటర్న్‌లు వెబ్‌సైట్స్, ఇమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్, సేల్స్ కొలేటరల్స్, వీడియోలు, బ్లాగ్‌ల కోసం కంటెంట్ కాపీలను అభివృద్ధి చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలాగే టీంలోని ఇతర సభ్యులు రూపొందించిన కంటెంట్‌ను కూడా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు digilocker.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Internship, Llb students, Students, Union minister