హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: లా అసోసియేట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

Telangana Jobs: లా అసోసియేట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

తెలంగాణ లా అసోసియేట్ జాబ్స్‌

తెలంగాణ లా అసోసియేట్ జాబ్స్‌

తెలంగాణ ప్ర‌భుత్వం లా అసోసియేట్ (Law Associate) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ఆధారంగా కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం లా అసోసియేట్ (Law Associate) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ఆధారంగా కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 8, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఎంపిక విధానం, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://law.telangana.gov.in/home.do ను సంద‌ర్శించాలి. కేవ‌లం ఆఫ్‌లైన్ (Off line) ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని నోటిఫికేష‌న్‌లో ఏర్కొన్నారు. ప‌రీక్ష లేకుండా కేవ‌లం వైవా వోస్ (Viva voce) ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు. 30 ఏళ్ల లోపు ఉన్న లా చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు కావాల్సిన అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ గురించి తెలుసుకొనేందుకు చ‌ద‌వండి.

పోస్టుకు సంబంధించిన వివరాలు

దరఖాస్తు ప్రారంభంసెప్టెంబర్ 20, 2021
దరఖాస్తుకు  ఆఖరు తేదీఅక్టోబర్ 8, 2021
ఎంపిక విధానంవైవా వోస్
అధికారిక వెబ్ సైట్https://law.telangana.gov.in/home.do
జీతం నెలకురూ.60,000  +  రూ.15,000 ట్రాన్స్ పోర్టు అలవెన్స్
అర్హతలుమూడు లేదా  ఐదు  సంవత్సరాల లా  డిగ్రీ  పాసై ఉండాలి. బార్ కౌన్సిల్  ఆఫ్ తెలంగాణలో  నమోదై ఉండాలి. సంబంధిత రంగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.


IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ.. అప్లె చేసుకోండిలా


ఎంపిక విధానం..

- కేవ‌లం వైవా వోస్ ద్వారా మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

- అభ్య‌ర్థి ఎంపిక‌ను చీఫ్ సెక్ర‌ట‌రీ నామినేట్ చేసిన క‌మిటీ (Committee) నిర్వ‌హిస్తోంది.

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థి మెరిట్ (Merit) ఆధారంగా తుది ఫ‌లితం ఉంటుంది.

- వైవా వోస్ కొచ్చే అభ్య‌ర్థులు సొంత ఖ‌ర్చుల‌తో హైద‌రాబాద్‌ (Hyderabad)కు రావాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం ఖ‌ర్చులు భ‌రించ‌దు.

ద‌ర‌ఖాస్తు విధానం..

- ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://law.telangana.gov.in/home.do ను సంద‌ర్శించాలి.

- అనంత‌రం అప్లికేష‌న్ ఫాం డౌన్ లోడ్ చేసుకోవాలి. (అప్లికేష‌న్ ఫాం కోసం క్లిక్ చేయండి. )

- పూర్తి వివ‌రాలు నింపి రిజిస్ట‌ర్ పోస్టు ద్వారా Chief Secretary, Government of Telangana కు పంపాలి.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Telangana

ఉత్తమ కథలు