హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telecom Jobs: టెలికాం రంగంలో కొలువులే కొలువులు.. 5G రాకతో రానున్న ఉద్యోగాలెన్నో తెలుసా?

Telecom Jobs: టెలికాం రంగంలో కొలువులే కొలువులు.. 5G రాకతో రానున్న ఉద్యోగాలెన్నో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెలికాం కంపెనీలు 5G నెట్‌వర్క్‌ను మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు భారీగా పెరగనున్నాయని వెల్లడించింది ఒక లేటెస్ట్ సర్వే.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

మన దేశంలో అక్టోబర్ మొదటి వారంలోనే 5G సేవలు (5G Services) అధికారికంగా లాంచ్ అయ్యాయి. దీంతో ఎయిర్‌టెల్, జియో సంస్థలు కొన్ని నగరాల్లో 5G సర్వీస్‌ను ప్రారంభించాయి. టెలికాం కంపెనీలు ఈ నెట్‌వర్క్‌ను మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు (Jobs Recruitment) భారీగా పెరగనున్నాయని వెల్లడించింది ఒక లేటెస్ట్ సర్వే. ఇండియాలో 5జీ సేవలకు అనుగుణంగా కీలక కంపెనీలు వివిధ నగరాల్లో తమ డిజిటల్ సేవలను ప్రారంభించనున్నాయి. ఇందుకు డేటా సెంటర్ సామర్థ్యాలను విస్తరణకు అవసరమైన నియామక ప్రక్రియను చేపట్టనున్నాయి. దీంతో టెలికాం రంగంలో రాబోయే రోజుల్లో 13 శాతం ఉద్యోగాలు (Jobs) పెరిగే అవకాశం ఉందని తేల్చింది మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ సర్వే. 5G సేవలతో దేశంలో డిజిటల్ విప్లవం రానుందని.. టెలికాం రంగంతో పాటు ఇంపోర్ట్/ఎక్స్‌పోర్ట్, టూరిజం, BFSI వంటి రంగాల్లోనూ నియామక ప్రక్రియ రాబోయే రోజుల్లో జోరందుకోనుందని సర్వే పేర్కొంది.

ట్రావెల్ అండ్ టూరిజంలో 9 శాతం పెరుగుదల

కరోనా తరువాత నియామకాల విషయంలో గత సంవత్సరాలతో పోల్చితే ప్రస్తుత పండుగ సీజన్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని సర్వే పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. దిగుమతి/ఎగుమతి రంగంలో నియామకాలు 28 శాతం పెరిగాయి. డిజిటలైజేషన్ తరహాలోనే ఆటోమేషన్, ఆఫీస్ ఎక్విప్‌మెంట్ రంగంలో నిపుణుల డిమాండ్ 65 శాతం పెరిగింది. ఇక, BFSI రంగంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లో నియామకాల్లో 20 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ట్రావెల్ అండ్ టూరిజంలో కూడా నియామకాలు 9 శాతం పెరిగాయని సర్వే వెల్లడించింది.

SBI PO Recruitment 2022: స్టేట్ బ్యాంక్ లో 1673 పీఓ ఉద్యోగాలు .. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

నియాకాలు క్షీణించిన పరిశ్రమలు

వినియోగదారుల డిమాండ్ తగ్గడం, ముడిసరుకు ధరలు పెరగడంతో గృహోపకరణాల పరిశ్రమలో నియామకాల్లో 19 శాతం తగ్గుదల కనిపించింది. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో 19 శాతం, షిప్పింగ్ అండ్ మెరైన్ పరిశ్రమలో 18 శాతం, ఐటీ నియామకాల్లో 11 శాతం తగ్గుదల నమోదైందని సర్వే పేర్కొంది.

హైరింగ్ డిమాండ్ ఉన్న నగరాలు

నగరాల వారిగా చూస్తే రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం పెరుగుదలతో అహ్మదాబాద్‌లో హైరింగ్ డిమాండ్ పెరిగింది. టైర్ 2 నగరాల్లో కోయంబత్తూర్‌లో 7 శాతం పెరుగుదల కనిపించింది. జైపూర్‌ నియమాకాల్లో కేవలం ఒక శాతం వృద్ధిని కనబర్చింది. మెట్రో నగరాల్లో ముంబైలో 8 శాతం, హైదరాబాద్ 2 శాతం వృద్ధి కనిపించింది.

ఇక్కడ పతనం

నియామకాలు భారీగా తగ్గిన నగరాల్లో బరోడా 13 శాతంతో టాప్ ప్లేస్‌లో ఉంది. కోల్‌కతా 15 శాతం, చండీగఢ్ 9 శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే బెంగళూరు, చెన్నై, కొచ్చి, పుణె వంటి ప్రధాన నగరాల్లో కూడా నియామకాలు తగ్గాయని మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ సర్వే వెల్లడించింది.

First published:

Tags: 5G, 5g technology, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు