హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter Admissions: ఏపీలో పది పాసైన విద్యార్థులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Inter Admissions: ఏపీలో పది పాసైన విద్యార్థులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Inter Admissions: ఏపీలో ఇంటర్ అడ్మిషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌ గడువును పొడిగించింది.

ఏపీలో ఇంటర్ అడ్మిషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌ గడువును నవంబరు 6 వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటన విడుదల తెలిపారు. గతంలో విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 21నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పాత షెడ్యూల్ ప్రకారం గురువారంతో గడువు ముగిసింది. అయితే చాలా కాలేజీల వివరాలను ఆన్ లైన్ లో ఉంచకపోవడంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం విధించిన గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో ఆ విద్యార్థులు, తల్లిదండ్రులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. విద్యార్థుల సౌకర్యార్థం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ గడువును నవంబర్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఆ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.. ఆ ప్రకటన పూర్తిగా ఫేక్..

ఇదిలా ఉంటే.. ఎంసెట్ అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన పరీక్షలో కనీస మార్కుల నిబంధన నుంచి అభ్యర్థులకు మినహాయింపునిచ్చింది. ఈసారి ఇంటర్మీడియట్ లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం నిబంధన అవసరం లేదు. కేవలం వాళ్లు పాస్ మార్కులు తెచ్చుకున్నా.. (35 శాతం) సరిపోతుంది. 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు.. బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులలో సీట్లు పొందేందుకు పోటీ పడొచ్చని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం అధికారిక జీవోను విడుదల జారీ చేశారు.

కోవిడ్‌-19 నేపథ్యంలో ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులను 35 శాతం మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో 35 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంసెట్‌లో ర్యాంకులు పొందలేకపోయారు. వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వమే ఇంటర్‌లో ఉత్తీర్ణులుగా ప్రకటించి ఎంసెట్‌ ర్యాంకు ర్యాంకు కేటాయించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇంటర్ లో కనీస మార్కులతో ఉత్తీర్ణులైతే వారిని కూడా కౌన్సెలింగ్ కు అనుమతిస్తమాని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ఈ ఒక్క సంవత్సరానికే వర్తిస్తుందని, తర్వాతి విద్యా సంవత్సరం నుంచి అంతకుముందు లాగే కొనసాగుతుంది విద్యాశాఖ తెలిపింది.

First published:

Tags: Ap government, AP inter board, School admissions