ESIC Jobs : ESICలో 2,258 జాబ్స్.. అప్లై చేశారా.. ఈ రోజే చివరి అవకాశం

ESIC Notification | ఎంప్లాయ్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: April 15, 2019, 6:53 AM IST
ESIC Jobs : ESICలో 2,258 జాబ్స్.. అప్లై చేశారా.. ఈ రోజే చివరి అవకాశం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎంప్లాయ్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
న్యూ ఢిల్లీలోని ఎంప్లాయ్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఈఎస్‌ఐసీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 2, 258 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు.. అందులో తెలంగాణకు 133, ఆంధ్రప్రదేశ్‌కి 337 ఉద్యోగాలను కేటాయించారు. పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు : 2,258

పోస్టులు : స్టెనో గ్రాఫర్, యూడీసీ
విద్యార్హత : స్టెనో గ్రాఫర్ ఇంటర్, ఇంగ్లీష్/హిందీ టైపింగ్ తెలిసి.. నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
యూడీసీ పోస్టులకి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి


వయసు : 15-04-2019 నాటికి 18 -27 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తు ఫీజు : రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి)
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం : స్టెనోగ్రఫీ పోస్టులకు రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ నిర్వహస్తారు. యూడీసీ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలుంటాయి.
దరఖాస్తుకి చివరితేది : 15-04-2019
తెలంగాణ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఏపీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

Hotel Management Course : డిగ్రీ స్టూడెంట్స్ హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు ఇలా 
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు