L&T Infotech Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... 4,500 పోస్టుల్ని భర్తీ చేయనున్న ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్

L&T Infotech Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... 4,500 పోస్టుల్ని భర్తీ చేయనున్న ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ప్రతీకాత్మక చిత్రం)

L&T Infotech Jobs | సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోరుకునే ఫ్రెషర్స్‌కి అలర్ట్. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ వచ్చే ఏడాది మార్చిలోగా 4,500 ఫ్రెషర్స్‌ని నియమించుకోనుంది.

  • Share this:
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది మల్టీనేషనల్ టెక్ కన్సల్టింగ్, డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ లార్సెన్ & టూబ్రో ఇన్ఫోటెక్ (LTI). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఎల్‌టీఐ తాజాగా ప్రకటించింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ.. ఉద్యోగ వలసలను (అట్రిషన్ రేటును) నియంత్రించే చర్యల్లో భాగంగా కొత్త రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఐటీ సంస్థ 3,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ సంవత్సరం అంతకు మించి, 4,500 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు ఎల్‌టీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జలోనా.

జూన్ త్రైమాసికం నాటికి సంస్థలో 38,300 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 78 శాతం మందిని కంపెనీ ఆఫ్‌షోర్ కేంద్రాల్లో నియమించారు. జూన్ త్రైమాసికంలో ఈ సంస్థ నియామకాలను నాలుగు నుంచి ఆరు శాతానికి పెంచింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే.. మొదటి త్రైమాసికంలో ఎల్‌టీఐ అట్రిషన్ రేటు 18.3 శాతం నుంచి 15.2 శాతానికి తగ్గిందని జలోనా చెప్పారు. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే.. మార్చి త్రైమాసికంలో ఇది 12.3 శాతం నుంచి పెరిగిందని తెలిపారు.

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 282 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Head Constable Jobs: ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు

పెరుగుతున్న ఉద్యోగ వలసలు


కరోనా తరువాత అవకాశాలు మెరుగు పడటంతో, నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు మంచి ఉద్యోగాలకు మారుతున్నారు. దీంతో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ వలసలు పెరిగాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.6 శాతంతో అత్యల్ప అట్రిషన్ రేటును నమోదు చేసింది. మార్చి త్రైమాసికంలో ఆ సంస్థ అట్రిషన్ రేటు 7.2 శాతం ఉండగా, తదుపరి త్రైమాసికానికి పెరిగింది. ఇన్ఫోసిస్‌లో మార్చి త్రైమాసికానికి అట్రిషన్ రేటు 10.9 శాతం ఉండగా, జూన్ నాటికి 13.9 శాతానికి పెరిగి రెండవ అత్యల్ప అట్రిషన్ రేటును కలిగి ఉంది. విప్రో అట్రిషన్ రేటు మార్చిలో 12 శాతం ఉండగా, ప్రస్తుతం అది 15.5 శాతానికి పెరిగింది. జూన్ త్రైమాసికానికి అమెరికన్ బేస్డ్ కంపెనీ కాగ్నిజెంట్ అత్యధికంగా 31 శాతం అట్రిషన్ రేటును కలిగి ఉంది.

ECIL Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

RRB NTPC Results: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఎగ్జామ్ రాశారా? మీ మార్కులు ఇలా తెలుసుకోండి

భారీ లాభాలతో దుసుకెళ్తున్న సంస్థ


అట్రిషన్ రేటు ఉన్నప్పటికీ, లాభాల పరంగా ఎల్‌టీఐ దూసుకుపోతోంది. గత నెలలో LTI రూ.496.3 కోట్ల నికర ఆదాయంతో.. ఒక ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అత్యధిక లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 19.13 శాతం పెరిగడం విశేషం. దీంతో పాటు ఏడాదిలో సంస్థ రెవెన్యూ 17.4 శాతం వృద్ధి చెంది రూ.3,462.5 కోట్లకు చేరుకుంది. గత ఐదు సంవత్సరాల్లో సంస్థ ఆదాయం 13.5 శాతం వార్షిక రేటుతో పెరిగింది. ఇదే సమయంలో నికర ఆదాయం రెట్టింపు అయింది.

మధ్యప్రాచ్యం, యూరప్, ఉత్తర అమెరికా నుంచి వచ్చిన ఒప్పందాల కారణంగా జూన్ త్రైమాసికంలో లాభాలు వచ్చినట్లు జలోనా పేర్కొన్నారు. డిజిటల్ స్పేస్‌లో కొత్త ట్రెండ్స్ గురించి మాట్లాడుతూ.. క్లౌడ్, డేటా సంబంధిత అన్ని విభాగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఉద్యోగ వలసల కారణంగా.. టాలెంట్ ఉండి, మార్కెట్‌లో ఎక్కువ ప్రతిభ ఉన్నవారిని కంపెనీలు నియమించుకుంటున్నాయని వివరించారు.
Published by:Santhosh Kumar S
First published: