• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • LAB TECHNICIAN JOB VACANCIES IN SRI VENKATESWARA VETERINARY UNIVERSITY TIRUPATI ANDHRA PRADESH HERE FULL DETAILS NS

Andhra Pradesh Jobs: ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

Andhra Pradesh Jobs: ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(SVVU) శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(SVVU) శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ల్యాబరేటరీల్లోని ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.17,500 వేతనం చెల్లించనున్నారు.

    అర్హతలు..
    పదో తరగతి పాసైన వారితో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులో రెండేళ్ల డిప్లొమో కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థులు సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి గుర్తింపు పొంది ఉండాలి. 2020 జూలై 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల వయస్సు ఉండాలి. అయితే దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. మాజీ సైనికులకు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    ఖాళీలు..
    రాష్ట్రంలోని వివిద జిల్లాల్లో మొత్తం 147 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. విజయనరంలో 8, శ్రీకాకుళంలో 9, విశాఖప్నంలో 9, ఈస్ట్ గోదావరిలో 16, వెస్ట్ గోదావరిలో 14, గుంటూరులో 15, కృష్ణా జిల్లాలో 12, ప్రకాశంలో 11, నెల్లూరులో 8, చిత్తూరులో 12, కడపలో 9, కర్నూలులో 12, అనంతపురంలో 12 ఖాళీలు ఉన్నాయి.

    ఎలా అప్లై చేయాలంటే..
    అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు విద్యార్హతల సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, మెమోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 20వ తేదీ వరకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం మార్చి 29న మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. డీఎంఎల్టీ కోర్సులో మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజును రూ.200గా నిర్ణయించారు.
    Notification-Direct Link

    Official Website-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు