Home /News /jobs /

L AND T SCHOLARSHIP GOOD OPPORTUNITY FOR HIGHER EDUCATION KNOW DETAILS EVK

L&T Scholarship: ఉన్న‌త విద్య‌కు చేయూత‌.. విద్య‌ర్థుల‌కు ఎల్అండ్‌టీ స్కాల‌ర్‌షిప్ అవ‌కాశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

L&T Build India Scholarship 2022 | ఎల్ అండ్ టీ కన్‌స్ట్ర‌క్ష‌న్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్న‌త విద్య చేయాల‌నుకొనే వారికి చేయూత‌తో పాటు ఉద్యోగ అవ‌కాశాన్ని అందిస్తోంది. ఈ నేప‌థ్యంలో స్కాల‌ర్‌షిప్ పూర్తి వివ‌రాలు తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
    ఎల్ అండ్ టీ కన్‌స్ట్ర‌క్ష‌న్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంటెక్ చదివాల‌ని అనుకొనే విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫర్ అందిస్తోంది. ఉన్న‌త విద్య చ‌దువుకోవాలి అనుకొనే వారి కోసం ఎల్ అండ్ టీ బిల్డ్ ఇండియా స్కాల‌ర్‌షిప్ 2022 (L&T Build India Scholarship 2022) ఎంటెక్‌లో కన్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాల‌నుకునే విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కోర్సుకు సంబంధించిన వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.lntecc.com/build-india-scholarship/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Jobs in Andhra Pradesh: అనంత‌పురం జిల్లాలో ఉద్యోగాలు.. వేత‌నం రూ.37,000.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌!
      అర్హ‌త‌లు..
    - విద్యార్థులు సివిల్‌/ కోర్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ చేసి ఉండాలి.
    - గ్రాడ్యుయేష‌న్‌లో 70 శాతం మార్కులు వ‌చ్చి ఉండాలి. లేదా 7 సీజీపీఏ రావాలి.
    - విద్యార్థులు 2022లో ఉత్తీర్ణులై ఉండాలి.



    స్కాల‌ర్‌షిప్ స‌మాచారం.
    - చెన్నై/ ఢిల్లీలోని ఐఐటీలు, సుర‌త్క‌ల్‌/ తిరుచ్చిలోని ఎన్ఐటీల భాగ‌స్వామ్యంతో ఎల్&టీ సంస్థ ఈ ప‌థ‌కాన్ని చేప‌డుతోంది.
    - ఎంపికైన విద్యార్థులు ఈ నాలుగు ఇన్‌స్టిట్యూట్‌ల‌లోనే ఎంటెక్ (కన్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్) పూర్తి చేయాల్సి ఉంటుంది.
    - కోర్సు కాల వ్య‌వ‌ధి రెండు సంవ‌త్స‌రాలు.
    - ఈ ఇన్‌స్టిట్యూట్‌ల‌కు సంబంధించిన స్పాన్స‌ర్‌షిప్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజును ఎల్‌&టీ సంస్థ‌నే నేరుగా చెల్లిస్తుంది.
    - ఈ ఫీజుతోపాటు విద్యార్థుల‌కు నెల‌కు రూ.13,400 ఉప‌కార వేత‌నాన్ని సంస్థ అందిస్తుంది.

    TSPSC Group 2 Exam Pattern: గ్రూప్ 2కు జాబ్ మీ లక్ష్యమా? అయితే.. ఎగ్జామ్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి

    ముఖ్య‌మైన అంశం..
    ఈ కోర్సులో చేరే వారు ముందుగా సంస్థ‌తో ఒప్పందం చేసుకోవాలి. కోర్సు పూర్త‌యిన అయిదేళ్ల‌పాటు ఎల్&టీ సంస్థ‌లోనే ప‌ని చేయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థిపై సంస్థ సుమారు రూ.5 లక్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌నుంది.

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌తో ఆన్లైన్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
    -ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారిని ఇంట‌ర్వ్యూకు పిలుస్తారు.
    - అనంత‌రం ఇంట‌ర్వ్యూ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక అయిన వారికి మెడిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు

    ముఖ్య‌మైన తేదీలు
    దరఖాస్తుకు చివరితేది: మార్చి 31, 2022
    ఆన్‌లైన్‌ రాత పరీక్ష: ఈ ఏడాది ఏప్రిల్, 2022 - మే, 2022
    ఇంటర్వ్యూ ప్రక్రియ: ఈ ఏడాది మే, 2022 - జూన్‌, 2022 మధ్య ఉంటుంది.
    తుది ఎంపిక : ఈ ఏడాది జూన్‌ 3వ వారం.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.lntecc.com/build-india-scholarship/ ను సంద‌ర్శించాలి.

    Step 3 - APPLY NOW FOR BUILD INDIA SCHOLARSHIP 2022 అనే లింక్‌లోకి వెళ్లాఇ.

    Step 4 - అనంత‌రం Register here క్లిక్ చేయాలి.

    Step 5 - పేరు, ఈమెయిల్ ఐడీతో రిజిస్ట‌ర్ చేసుకొని ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

    Step 6 - త‌రువాత స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

    Step 7 - ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, EDUCATION, Scholarship, Scholarships

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు