ఎల్ అండ్ టీ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. లార్సెన్ అండ్ టుబ్రో కంపెనీలో ఇంజనీర్ ట్రెయినీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 60 శాతం మార్కులతో అభ్యర్థులు పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 5లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల్లో..
1. ఎలక్ట్రికల్
2. సివిల్
3. మెకానికల్
4. మెకాట్రానిక్స్
5. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
6. ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్
7. ఆటోమొబైల్
8. ఎన్విరాన్‌మెంటల్ హెల్త్/ సేఫ్టీ
9. కంప్యూటర్ సైన్స్/ఐటీ
10. మైనింగ్
11. ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్
12. కెమికల్
13. మెటలర్జీ
మొత్తం 13 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30 వరకు అభ్యర్థులు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్/సైన్స్/ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే దరఖాస్తుకు అనర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు జులై 01, 2001 నుంచి జూన్ 30, 2005 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
-తర్వాత దీనిలో పేర్కొన్న విధంగా వివరాలను నమోదు చేయాలి.
-దీని తర్వాత అభ్యర్థి తమ లేటెస్ట్ రెజ్యూమ్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
-తర్వాత ఫొటో అప్ లోడ్ చేసి.. అప్లై అనే ఆప్షన్ ను క్లిక్ ఇవ్వాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Central jobs, JOBS