కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయలో ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. టీజీటీ, స్పోర్ట్స్ కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పీఆర్‌టీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, కౌన్సిలర్, నర్స్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 మార్చి 25న ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇవి పార్ట్‌టైమ్, కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. 2021-22 విద్యా సంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mahabubabad.kvs.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూకు వెళ్లాలి.
MES Recruitment 2021: మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 502 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Job Mela in Vijayawada: మొత్తం 800 ఉద్యోగాల భర్తీకి విజయవాడలో ఇంటర్వ్యూలు... యువతులకు మాత్రమే
టీజీటీ- ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, సైన్స్, సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఆర్ట్
స్పోర్ట్స్ కోచ్ (యోగా)
డేటా ఎంట్రీ ఆపరేటర్
పీఆర్‌టీ
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
కౌన్సిలర్
నర్స్
GMH Tirupati Recruitment 2021: తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: హైదరాబాద్, విశాఖపట్నంలో హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ- 2021 మార్చి 25
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టీజీటీ పోస్టుకు డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి. పీఆర్‌టీ పోస్టుకు ఇంటర్ పాస్ కావడంతో పాటు రెండేళ్ల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సు పాస్ కావాలి. సీటెట్ క్వాలిఫై అయినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇతర పోస్టులకు విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఇంటర్వ్యూ జరిగే స్థలం- కేంద్రీయ విద్యాలయ, మహబూబాబాద్
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ. రాతపరీక్షలో క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలి.
వేతనం- కేంద్రీయ విద్యాలయ నియమనిబంధనల ప్రకారం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.