హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

KVS: కేంద్రీయ విద్యాలయ ఒకటో తరగతి అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభం.. అర్హత, ఇతర వివరాలివే..!

KVS: కేంద్రీయ విద్యాలయ ఒకటో తరగతి అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభం.. అర్హత, ఇతర వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకటో తరగతి ప్రవేశాల కోసం KVS ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలను పరిశీలిద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

KVS: సెంట్రల్ బోర్డుల విద్యా విధానం స్టేస్ సిలబస్ కంటే భిన్నంగా, అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. అందుకే సీబీఎస్‌ఈ(CBSE), సీఐఎస్‌సీఈ(CISCE), కేవీఎస్(KVS) వంటి సెంట్రల్ బోర్డుల ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను ఈ సంస్థల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారికి తాజాగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) గుడ్ న్యూస్ చెప్పింది. ఒకటో తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలను పరిశీలిద్దాం.

కేవీఎస్‌లో ఒకటో తరగతి ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చి 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈ గడువు ఏప్రిల్ 17 సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. అర్హత ఉన్న పిల్లల తరఫున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అధికారిక పోర్టల్ kvsangathan.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందు కేవీఎస్ అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి, అందుబాటులో ఉన్న KVS class 1 admission 2023 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ కోడ్, పిల్లల పుట్టిన తేదీ, రిజిస్టర్ మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి.

- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అడిగిన అన్ని వివరాలను ఎంటర్ చేసి, అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.

- భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోండి.

WhatsApp: వాట్సాప్‌లో అవతార్ ఎలా క్రియేట్ చేయాలి..? డీపీగా ఎలా పెట్టాలి..? తెలుసుకోండి..

* ఏప్రిల్ 20న మొదటి లిస్ట్ విడుదల

ఎంపికైన విద్యార్థుల మొదటి తాత్కాలిక లిస్ట్, వెయిట్ లిస్ట్ ఏప్రిల్ 20న విడుదల అవుతుంది. ఏప్రిల్ 21 నుంచి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే.. ఏప్రిల్ 28న సెకండ్ లిస్ట్, మే 4న మూడో లిస్ట్‌ను రిలీజ్ చేస్తారు. రెండో తరగతి, ఆపై తరగతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 12 సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. వివిధ తరగతుల్లో ఖాళీలు ఉంటేనే ఈ ప్రక్రియను కేవీఎస్ చేపడుతుంది.

* అర్హత ప్రమాణాలు

కేవీఎస్ ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే, పిల్లల కనీస వయసు 2023 మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. మిగతా తరగతులకు సైతం కనీస వయసు నిర్ధారణ‌ను మార్చి 31 నాటికి లెక్కించనున్నారు. KVS అడ్మిషన్ గైడ్‌లైన్స్ 2023-24 ప్రకారం సీటు రిజర్వ్ చేయనున్నారు. పేరెంట్స్ తమ బిడ్డ కోసం ఒక అప్లికేషన్ ఫారమ్‌ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే, చివరి ఫారమ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

First published:

Tags: CBSE, EDUCATION, JOBS, Kvs

ఉత్తమ కథలు