హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

KVS Admission: మార్చి 27 నుంచి కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్.. ఇలా అప్లై చేయండి..

KVS Admission: మార్చి 27 నుంచి కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్.. ఇలా అప్లై చేయండి..

KVS Admission: మార్చి 27 నుంచి కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్.. ఇలా అప్లై చేయండి..

KVS Admission: మార్చి 27 నుంచి కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్.. ఇలా అప్లై చేయండి..

KVS Admission: 2023–24 విద్యా సంవత్సరానికి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ప్రారంభించింది. మార్చి 27 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుందని కేవీఎస్ వెల్లడించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్రీయ విద్యాసంస్థల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన విద్యా విధానంలో ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. అందుకే సీబీఎస్‌ఈ, నవోదయ, కేవీఎస్ సిలబస్ బోధించే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యా సంవత్సరానికి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ప్రారంభించింది. మార్చి 27 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుందని కేవీఎస్ వెల్లడించింది.

కేవీఎస్‌లో ఒకటో తరగతి ప్రవేశానికి కనీస వయసు ఆరు సంవత్సరాలు కాగా, అడ్మిషన్ టైమ్‌టేబుల్ అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in లో అందుబాటులో ఉంది. పిల్లల కోసం దరఖాస్తులను తల్లిదండ్రులు ఏప్రిల్ 17, సాయంత్రం 7 వరకు సమర్పించవచ్చు. అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ అడ్మిషన్ ఫారమ్‌తో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలి.

* నోటిఫికేషన్ వివరాలు

వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్న, విదేశాల్లోని 1248 కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. KVS అడ్మిషన్ 2023 నోటిఫికేషన్ క్లాస్-1 కోసం అప్లికేషన్ ప్రాసెస్ 2023 మార్చి 27న ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 17 నాటికి ఈ గడువు ముగుస్తుందని నోటిఫికేషన్‌లో ఉంది. ఇతర తరగతులకు అప్లికేషన్ పీరియడ్ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 12 వరకు ఉంటుంది. అడ్మిషన్ కోసం సరిగ్గా నింపిన ఫారమ్‌ను సంబంధిత KVలోని ప్రిన్సిపాల్ ఆఫీస్‌లో అందించాలి.

* తేదీల వివరాలు..

KVS క్లాస్ 1 అడ్మిషన్ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్‌ను ఏప్రిల్ 20న విడుదల చేస్తారు. ఎంపిక చేసిన జాబితా నుంచి అర్హులైన అభ్యర్థుల అడ్మిషన్ ప్రాసెస్ ఏప్రిల్ 21న ప్రారంభమవుతుంది. సీట్లు పూర్తిగా నిండకపోతే, సెకండ్ లిస్ట్‌ను ఏప్రిల్ 28న ప్రకటించనున్నారు. మే 4న థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇతర తరగతుల సెలక్షన్ లిస్ట్‌ను ఏప్రిల్ 17న ప్రకటిస్తారు. అడ్మిషన్ ప్రాసెస్ ఏప్రిల్ 18న ప్రారంభమై, ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు, తల్లిదండ్రులు నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : ఆ నైపుణ్యాలున్న వారికే ఇండియాలో డిమాండ్‌.. ఉద్యోగం తొందరగా వస్తుంది!

* అప్లికేషన్ ప్రాసెస్

KVS అడ్మిషన్ 2023, క్లాస్ 1 అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..

స్టెప్- 1: ముందు కేవీఎస్ అధికారిక వెబ్‌సైట్ kvsaonlineadmission.kvs.gov.in విజిట్ చేయాలి.

స్టెప్- 2: KVS అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ చేయాలి.

స్టెప్- 3: వెబ్‌సైట్‌లో ఇచ్చిన అన్ని సూచనలను జాగ్రత్తగా చదవండి.

స్టెప్- 4: అడ్మిషన్ ప్రాసెస్ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి.

స్టెప్- 5: పిల్లల పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ వివరాలతో ఫారమ్‌ను నింపండి. భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Kvs

ఉత్తమ కథలు