KVS ADMISSION 2022 EXTENSION OF KENDRIYA VIDYALAYA CLASS 1 REGISTRATION DATE FULL DETAILS TO KNOW ABOUT THE APPLICATION PROCESS GH VB
KVS Admission 2022: కేంద్రీయ విద్యాలయ క్లాస్ 1 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగింపు.. అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..
ప్రతీకాత్మక చిత్రం
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించే గడువును కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 11న ఈ గడువు ముగియాల్సి ఉండగా, రిజిస్ట్రేషన్ చివరి తేదీని సంస్థ ఏప్రిల్ 13 వరకు పెంచింది.
కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ అప్లికేషన్(Online Application) సమర్పించే గడువును కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 11న ఈ గడువు ముగియాల్సి ఉండగా, రిజిస్ట్రేషన్(Registration) చివరి తేదీని సంస్థ ఏప్రిల్ 13 వరకు పెంచింది. KVS క్లాస్ 1 అప్లికేషన్ ఫారమ్‌లు అధికారిక వెబ్సైట్ kvsonlineadmission.kvs.gov.in లో అందుబాటులో ఉన్నాయి. ఈ తేదీ విషయంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది. 2022- 2023 అకడమిక్ సెషన్ కోసం కేంద్రీయ విద్యాలయాల్లో క్లాస్ 1 తాజా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించాలని హైకోర్టు KVSని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాల్సి వచ్చింది.
* KVS అడ్మిషన్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తు ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. ముందు తల్లిదండ్రులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత స్పెషల్ లాగిన్ కోడ్‌ను కేటాయిస్తారు. అప్లికేషన్ ఫారమ్‌ను పూరించడానికి లాగిన్ కోడ్ అవసరం. అప్లికేషన్ సమర్పించడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం.
తెలుసుకోవాల్సిన విషయాలు
తల్లిదండ్రులు ఒక బిడ్డ కోసం ఒకే కేంద్రీయ విద్యాలయంలో ఒక దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ ఫారమ్‌లను సమర్పిస్తే.. చివరి దరఖాస్తును మాత్రమే ప్రవేశానికి అర్హతగా పరిగణనలోకి తీసుకుంటారు. డబుల్ షిఫ్ట్ కేంద్రీయ విద్యాలయంలో ప్రతి షిఫ్ట్‌ను అడ్మిషన్ కోసం ప్రత్యేక విద్యాలయంగా పరిగణిస్తారని KVS అప్లికేషన్ గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.