KVS Admission 2020: కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం... ఇలా అప్లై చేయండి

KVS Admission 2020 | కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో అడ్మిషన్లు కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

news18-telugu
Updated: July 20, 2020, 11:38 AM IST
KVS Admission 2020: కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం... ఇలా అప్లై చేయండి
KVS Admission 2020: కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం... ఇలా అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతిలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ఆగస్ట్ 7 వరకు ఆన్‌లైన్ రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో తరగతి నుంచి అన్ని క్లాసులకు ఇవాళ్టి నుంచి జూలై 25 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. ఈ క్లాసుల్లో ఖాళీలు ఉంటేనే అడ్మిషన్లు లభిస్తాయి. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఇటీవల కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో అడ్మిషన్ రూల్స్ మారాయి. వాటి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Jobs: తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాలు... సిలబస్ ఇదే

KVS Admission 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


1వ తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 జూలై 20 ఉదయం 10 గంటల నుంచి
1వ తరగతిలో అడ్మిషన్ల దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7 సాయంత్రం 7 గంటలు
మొదటి జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 11రెండో జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 24
మూడో జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 26
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం రెండో నోటిఫికేషన్ విడుదల- 2020 ఆగస్ట్ 31
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 5
రెండో తరగతి నుంచి ఇతర తరగతులకు దరఖాస్తులు- 2020 జూలై 20 నుంచి జూలై 25 వరకు
ఎంపికైన వారి జాబితా విడుదల- 2020 జూలై 29
అడ్మిషన్లు- 2020 జూలై 30 నుంచి 2020 ఆగస్ట్ 7

Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 290 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Inter Admissions: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం... వివరాలివే

KVS Admission 2020: అప్లై చేయండి ఇలా...


ముందుగా https://kvsonlineadmission.kvs.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Click here to register పైన క్లిక్ చేయాలి.
నియమనిబంధనలన్నీ చదివి PROCEED పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ఐడీ ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
ఫోటో, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
Published by: Santhosh Kumar S
First published: July 20, 2020, 11:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading