• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • KVIC RECRUITMENT 2019 KHADI AND VILLAGE INDUSTRIES COMMISSION NOTIFICATION FOR 119 VACANCIES KNOW DETAILS SS

Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...

Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)

KVIC Recruitment 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ వివరంగా చదవాలి.

  • Share this:
    కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్-KVIC అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. గ్రూప్ బీ, సీ కేటగిరీల్లో మొత్తం 119 పోస్టుల్ని భర్తీ చేయనుంది KVIC. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ వివరంగా చదవాలి. ఉద్యోగాల భర్తీకి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు జూలై 31 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

    KVIC Recruitment 2019, Khadi and Village Industries Commission, KVIC Jobs, Degree jobs, MBA Jobs, latest jobs, కేవీఐసీ రిక్రూట్‌మెంట్ 2019, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవీఐసీ ఉద్యోగాలు, డిగ్రీ ఉద్యోగాలు, ఎంబీఏ ఉద్యోగాలు, తాజా ఉద్యోగాలు
    Source: KVIS

    KVIC Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


    మొత్తం పోస్టులు- 119
    దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 1
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూలై 31
    కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ పరీక్ష- 2019 ఆగస్ట్‌లో నిర్వహంచే అవకాశం
    విద్యార్హత: విలేజ్ ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు ఏదైనా మాస్టర్స్ డిగ్రీతోపాటు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. ఎఫ్‌బీఏఏలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎంకామ్‌తోపాటు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ. గ్రూప్‌ సీలో ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు ఆయా విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ తప్పనిసరి. అసిస్టెంట్ పోస్టులకు డిప్లొమా పూర్తి చేయాలి.
    వయస్సు: అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు 40 ఏళ్లు, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటీవ్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు 32 ఏళ్లు.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IRCTC Jobs: ఐఆర్‌సీటీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

    Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... ప్రారంభమైన రిజిస్ట్రేషన్
    Published by:Santhosh Kumar S
    First published: