విద్యారంగంలో పేరొందిన కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya vidyalaya) అడ్మిషన్లకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (Kendriya vidyalaya Online Registration) ప్రక్రియ మార్చి 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో బర్త్ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ తొలి జాబితాను ఏప్రిల్ 20న ప్రకటించనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. సీట్లు మిగిలిపోతే ఖాళీలను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాను ప్రకటించి సీట్లను భర్తీ చేస్తారు. ఇక రెండో తరగతితో పాటు, పై తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు.. ఏప్రిల్ 3వ తేదీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
అప్లికేషన్ ప్రాసెస్:
స్టెప్- 1: ముందు కేవీఎస్ అధికారిక వెబ్‌సైట్ kvsaonlineadmission.kvs.gov.in విజిట్ చేయాలి.
స్టెప్- 2: KVS అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ చేయాలి.
స్టెప్- 3: వెబ్‌సైట్‌లో ఇచ్చిన అన్ని సూచనలను జాగ్రత్తగా చదవండి.
స్టెప్- 4: అడ్మిషన్ ప్రాసెస్ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి.
స్టెప్- 5: పిల్లల పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ వివరాలతో ఫారమ్‌ను నింపండి. భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, School admissions