హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Kurnool: విద్యార్థులకు శుభవార్త..! కర్నూలు ఉర్దూ యూనివర్సిటీలో వెబ్‌ ఆప్షన్స్‌ ప్రారంభం..!త్వరపడండి..!

Kurnool: విద్యార్థులకు శుభవార్త..! కర్నూలు ఉర్దూ యూనివర్సిటీలో వెబ్‌ ఆప్షన్స్‌ ప్రారంభం..!త్వరపడండి..!

కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ

కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ

Kurnool: కర్నూలు నగరంలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీలో 2022 - 23 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులు… ఈ నెల 23వ తేదీ నుండి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు తెలిపారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  కర్నూలు (Kurnool) లోని ఉర్దూ యూనివర్సిటీ (Urdu University) లో డిగ్రీ (Degree) కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు త్వరపడండి. వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కర్నూలు నగరంలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీలో 2022 - 23 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులు… ఈ నెల 23వ తేదీ నుండి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు తెలిపారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీలో మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో బి.ఏ. (హెచ్.ఈ.పి), బి.ఏ.(హెచ్.యు.పి), బి.కాం.(కంప్యూటర్ అప్లికేషన్స్), బి.ఎస్సి (ఎం.ఎస్.సీఎస్) తో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎం.ఎస్.సి బోటని మరియు జువాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థిని విద్యార్థులు… కాలేజీ వెబ్ సైట్ నందు ఈ నెల 23వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ లో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీ, కర్నూలును ఎంపిక చేసుకోవాలని సూచించారు.

  సీట్ల కేటాయింపు అనంతరం యూనివర్శిటీ కళాశాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలో చేరే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం జగనన్న విద్యా దీవేనె, జగనన్న వసతీ దీవెన, National Scholarship Portal పథకాల కింద విద్యార్థులకు వచ్చే స్కాలర్‌షిప్‌లు కూడా ఇక్కడ విద్యార్థులకు వర్తిస్తాయని రిజిస్ట్రార్ తెలిపారు.

  ఇది చదవండి: హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో ఉద్యోగ అవకాశాలు..! డిగ్రీ అర్హతతో రూ.2 లక్షల వేతనం..!

  ఉర్దూ భాషా అభివృధ్ధికి సేవలందించిన ఉస్మానియా విద్యాలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ స్మారకంగా కర్నూలులో ఆయన పేరుతో ఉర్దూ యూనివర్సిటీని అనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య లక్ష్యం ఉర్దూ భాషను ప్రోత్సహించడం.. దాన్ని అభివృద్ధి చేయడం. వృత్తి మరియు సాంకేతిక అంశాలలో ఉర్దూ మాధ్యమం ద్వారా విద్య మరియు శిక్షణను అందిస్తోంది. ఉర్దూ మాధ్యమంలో ఉన్నత విద్య మరియు శిక్షణ కార్యక్రమాలను అభ్యసించాలనుకునే వ్యక్తులకు ఈ క్యాంపస్‌ ఆహ్వానం పలుకుతోంది.

  ఇది చదవండి: మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌..! వెయ్యి నుంచి రూ.25 వేలు పొందే అవకాశం..! త్వరపడండి..!

  డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి సందేహాలు ఉన్న విద్యార్థులు… యూనివర్సిటీలో విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ తెలిపారు.

  ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవడం కోసం https://sche.ap.gov.in , https://oamdc1-apsche.aptonline.in సైట్‌ను చూడండి. ఫోన్ నెంబర్ :- 08518 240025 , అడ్రస్‌ :- D.No. 5-2, కె.సి. భవనం, పందిపాడు గ్రామం, గూటి రోడ్, సేల్స్ టాక్స్ ఆఫీస్ ఎదురుగా, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ - 518002

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, EDUCATION, Kurnool, Local News