Railway Recruitment 2021: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక

ప్రతీకాత్మక చిత్రం

పలు ఉద్యోగాల భర్తీకి కొంకణ్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  • Share this:
    కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(KRCL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, STA, JTA పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అయితే అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూలను ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.
    IT Jobs: ఫ్రెషర్స్ కు HCL శుభవార్త.. త్వరలో 22 వేల నూతన నియామకాలు.. వివరాలివే
    India Post Recruitment 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి.. వివరాలివే

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 1, STA(సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్) - 5 పోస్టులు, JTA(జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్)-1 పోస్టు ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
    STA - సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసిన వారు ఈ విభాగంలోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    JTA-సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Notification & Application - Direct Link

    ఇతర వివరాలు: ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ముందు అభ్యర్థులు ఇన్స్ట్రక్షన్ షీట్లోని నిబంధనలను జాగ్రత్తగా చదివాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు కనీసం రెండేళ్ల పాటు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేవారు.
    Published by:Nikhil Kumar S
    First published: