భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. కరోనా వైరస్ లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో రైల్వే జోన్లు ఖాళీల భర్తీ కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్-KRCL టెక్నీషయన్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 58 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 27 చివరి తేదీ. అభ్యర్థులు అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://konkanrailway.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో అప్లై చేయాలి.
IBPS RRB Recruitment 2020: మొత్తం 8424 బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా...
BDL Recruitment 2020: సంగారెడ్డిలోని బీడీఎల్‌లో 119 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 58
అన్ రిజర్వ్డ్- 32
ఈడబ్ల్యూఎస్- 04
ఓబీసీ- 3
ఎస్సీ- 14
ఎస్టీ- 5
ఎక్స్ సర్వీస్‌మెన్- 6
దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 27
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- తేదీలను త్వరలో వెల్లడించనున్న కొంకణ్ రైల్వే
విద్యార్హతలు- మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్సీతో పాటు ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెకానిక్ హెచ్‌టీ, ఎల్టీ ఎక్యూప్మెంట్, కేబుల్ జాయింటింగ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 2021 నాటికి జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏల్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఎకనమిక్ బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థులకు రూ.250.
ECIL Recruitment 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు 3 రోజులే గడువు... హైదరాబాద్‌లో ఖాళీలు
Bank Jobs 2020: మొత్తం 3517 బ్యాంకు ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తులు... అప్లై చేయండిలా
అభ్యర్థులు ముందుగా http://konkanrailway.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
ముందుగా వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
అభ్యర్థుల మెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది.
రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని కాపీ భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways