• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • KOLKATA TEACHER CONVERTS DOUBLE DOOR REFRIGERATOR INTO LIBRARY WITH BOOKS SS GH

Fridge bookshelf: ఈ ఫ్రిజ్‌లో ఫుడ్ ఐటెమ్స్ కాదు పుస్తకాలుంటాయి... ఫ్రిజ్‌ను లైబ్రెరీగా మార్చిన టీచర్

Fridge bookshelf: ఈ ఫ్రిజ్‌లో ఫుడ్ ఐటెమ్స్ కాదు పుస్తకాలుంటాయి... ఫ్రిజ్‌ను లైబ్రెరీగా మార్చిన టీచర్ (ప్రతీకాత్మక చిత్రం)

Fridge bookshelf | కోల్‌కతాలో ఓ జంట రిఫ్రిజిరేటర్‌ను లైబ్రరీగా మార్చేసింది. వారి ప్రయత్నానికి ప్రశంసలు లభిస్తున్నాయి.

  • Share this:
పుస్తకాలు చదివే అలవాటు వ్యక్తుల మనో వికాసానికి తోడ్పడుతుందని చాలామంది భావిస్తారు. పుస్తక పఠనం విషయంలో కోల్‌కతా వాసులు మన దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకంటే ముందు వరుసలో ఉంటారు. ఈ నగరంలోని ప్రతి వీధిలో బుక్ స్టోర్స్ కనిపిస్తాయి. ప్రజలు స్మార్ట్ ఫోన్లతో సమయం తెలియకుండా గడుపుతున్న ఈ రోజుల్లో కూడా కోల్‌కతా ప్రజలు పుస్తకాలు చదువుతారు. నగరంలోని కాలేజ్ స్ట్రీట్ ప్రాంతానికి దేశంలోని అతిపెద్ద పుస్తకాలు అమ్మే మార్కెట్‌గా గుర్తింపు ఉంది. తాజాగా ఈ నగరవాసుల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించే ప్రయత్నం చేస్తోంది ఒక జంట. వారు సొంతంగా సేకరించిన పుస్తకాలతో ఒక వీధి మొత్తాన్నీ లైబ్రరీగా మార్చారు. ఈ ఫ్రీ స్ట్రీట్ లైబ్రరీ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

కోల్‌కతాకు చెందిన కాళిదాసు హల్దార్, కుంకుమ్ హల్దార్ దంపతులు ఈ పనికి శ్రీకారం చుట్టారు. కాళిదాసు హై స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. కరోనా తరువాత పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రజలు ఈ అలవాట్లను మానేసి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే మంచిదని కాళిదాసు భావించారు. ఇలా నగరంలోని పాతులి అనే ప్రాంతంలో ముందు ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలనుకున్నారు. పాఠకులను ఆకర్షించడానికి ఒక పాత ఫ్రిజ్‌లో పుస్తకాలను పెట్టాలని నిర్ణయించుకున్నారు. స్థానికంగా ఉండే తారాపాద కహార్ అనే కిరాణా షాపు యజమానితో ఈ విషయం పంచుకున్నారు. ఆయన కూడా ఒప్పుకోవడంతో ఆ షాపులో బుక్ షెల్ఫ్‌గా మార్చిన ఫ్రిజ్‌ను ఏర్పాటు చేశారు. దీని నుంచి ఎవరైనా ఉచితంగా పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చని ప్రచారం చేశారు.

BHEL Jobs 2021: బీహెచ్ఈఎల్‌లో 389 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Changing Job: ఉద్యోగం మారుతున్నారా? అయితే ఈ విషయాలు మర్చిపోవద్దు


కిరాణా షాపులో సరకులు కొనడానికి వచ్చేవారి ద్వారా ఈ విషయం స్థానికులందరికీ తెలిసింది. కొన్ని రోజుల్లోనే కాళిదాసు దంపతుల ప్రయత్నం విజయవంతమైంది. దీంతో స్థానికంగా ఉండే మరిన్ని కిరాణా షాపుల యజమానులను వారు ఒప్పించారు. సౌత్ కోల్‌కతాలోని చాలా కిరాణా షాపులు కాళిదాసు దంపతుల ప్రయత్నానికి మద్దతు ప్రకటించాయి. దుకాణాల ముందు ర్యాక్‌లు, బుక్‌ షెల్ఫ్‌లు, పాత ఫ్రిజ్‌లలో పుస్తకాలను ఉంచుతారు. డిక్షనరీలు, నవలలు, సాహిత్యం, ఇతర విభాగాలు, వివిధ భాషలకు చెందిన పుస్తకాలను కాళిదాసు దంపతులు ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.

NTA Recruitment 2021: మొత్తం 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

IIT Summer Internship: ఐఐటీలో ఇంటర్న్‌షిప్... ఎవరైనా అప్లై చేయొచ్చు ఇలా

వీటిని ఎవరైనా తీసుకెళ్లవచ్చు. కానీ ఒక నెల రోజుల్లో తిరిగి ఇవ్వాలనే నియమం ఉంటుంది. ఒక్కసారి ఒక్క పుస్తకం మాత్రమే తీసుకెళ్లాలి. ప్రజల వద్ద ఉన్న పాత పుస్తకాలను వీటిల్లో స్వచ్ఛందంగా పెట్టవచ్చు. ప్రతి నెలా ఒక పుస్తకం చదివితే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని నోటీస్ బోర్డులో రాయడం విశేషం. ఈ కార్యక్రమం కోసం రూ.45,000 వరకు సొంతంగా ఖర్చు చేసి కొన్ని వందల పుస్తకాలను సేకరించామని కాళిదాసు దంపతులు చెబుతున్నారు.

ఇప్పుడు పాతులి ప్రాంతంలోని ప్రతి దుకాణం ముందు ఒక ఉచిత లైబ్రరీ కనిపిస్తోంది. ఈ విషయాన్ని VisionHistory పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్‌ షేర్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. పాత ఫ్రిజ్‌లను ఫ్రీ స్ట్రీట్ లైబ్రరీగా మార్చే ఆలోచన చేసిన కాళిదాసు, కుంకుమ్ హల్దార్‌లను, వీరికి అండగా నిలిచిన కిరాణా షాప్ యజమాని తారాపాద కహార్‌లను నెటిజన్లు అభినందిస్తున్నారు. తమ ప్రాంతంలో కూడా ఇలాంటి ఉచిత లైబ్రరీలను ఏర్పాటు చేయాలని కొందరు ట్వీట్‌కు కామెంట్లు పెడుతున్నారు. బుక్ రీడింగ్ అలవాటును ప్రోత్సహిస్తున్న కాళిదాసు దంపతులు కోల్‌కతాకు గర్వకారణంగా నిలిచారని ఒక వ్యక్తి కామెంట్ పెట్టారు. ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని మరో వ్యక్తి కామెంట్ రాశారు.
Published by:Santhosh Kumar S
First published: