Home /News /jobs /

KNOW YOUR PARAMILITARY CISF IS CRUCIAL IN THE SECURITY OF GOVERNMENT AGENCIES AIRPORTS VVIPS THINGS TO KNOW ABOUT THIS SPECIAL FORCE GH VB

Know Your Paramilitary: భద్రతలో(Security) కీలకం CISF.. ఈ స్పెషల్ ఫోర్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోని ముఖ్యమైన సంస్థలను రక్షించడంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF-Central Industrial Security Force) కీలకం. 1969లో 3,129 మంది జవాన్లతో ప్రారంభమైన ఈ దళం ఇప్పుడు 1.5 లక్షల మందికి పైగా జవాన్లతో దేశంలోనే మూడో అతిపెద్ద పారామిలటరీ సంస్థగా అవతరించింది.

ఇంకా చదవండి ...
భారతదేశంలోని ముఖ్యమైన సంస్థలను రక్షించడంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF-Central Industrial Security Force) కీలకం. 1969లో 3,129 మంది జవాన్లతో ప్రారంభమైన ఈ దళం ఇప్పుడు 1.5 లక్షల మందికి పైగా జవాన్లతో దేశంలోనే మూడో అతిపెద్ద పారామిలటరీ సంస్థగా అవతరించింది. విమానాశ్రయాలు(Airports), ఢిల్లీ మెట్రో(Delhi Metro), తాజ్ మహల్(Taj mahal) వంటి చారిత్రక కట్టడాలు, అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలు, కొన్ని ముఖ్యమైన ప్రైవేట్ సంస్థలు(Private Companies), ప్రముఖులకు(VIPs) కూడా ఈ దళం రక్షణ(Security) కల్పిస్తుంది. వివిధ ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు మొదలైన వాటికి సంప్రదింపులు, భద్రతా విశ్లేషణలను అందించే ఏకైక దళం ఇదే. CISF ఆర్థిక పరంగా ప్రభుత్వానికి అత్యంత తక్కువ భారం. ఎందుకంటే దాని భద్రత పరిధిలో ఉన్న సంస్థలు, స్థలాల నుంచే ఎక్కువ డబ్బు వస్తుంది. ప్రస్తుతం CISF Z+, Z, X, Y విభాగాలలోని ప్రముఖ వ్యక్తులకు కూడా భద్రతను అందిస్తోంది. అగ్నిమాపక విభాగాన్ని కలిగి ఉన్న ఏకైక దళం ఇది.

Know Your Paramilitary: నక్సలిజం, ఉగ్రవాదం నిర్మూలనలో CRPF కీలకం.. వీఐపీలకు భద్రత కల్పిస్తున్న ప్రత్యేక దళం..


హిస్టరీ
CISF ప్రయాణం 1969 మార్చి 10న ప్రారంభమైంది. దేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థలను రక్షించడానికి ఈ దళం ఏర్పడింది. కానీ 1999 డిసెంబర్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ IC 814 హైజాక్ అయిన తర్వాత, భారత ప్రభుత్వం CISFను విస్తరించాలని నిర్ణయించింది. విమానాశ్రయాలకు కూడా రక్షణ కల్పించాలని కోరింది. 2000లో జైపూర్ విమానాశ్రయం రక్షణ బాధ్యతను CISF కి అప్పగించారు. 2006లో వీవీఐపీలకు భద్రత కల్పించే బాధ్యతలను అప్పగించడంతో ఈ దళం ప్రత్యేక భద్రతా బృందాన్ని ప్రారంభించింది. ఈ బృందం 2006 నవంబర్ నుండి పని చేయడం ప్రారంభించింది. 2007లో CISF కూడా మరొక బెంచ్‌మార్క్‌కు చేరుకుంది. ఢిల్లీ మెట్రోకు భద్రత కల్పించే అవకాశం దక్కించుకుంది.

1990ల నుండి ఇప్పటి వరకు, ఈ దళానికి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, వారసత్వ కట్టడాలు, అణు విద్యుత్ ప్లాంట్లు, అంతరిక్ష స్థాపనల భద్రత బాధ్యతలు అప్పగించారు. ఇటీవల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా మోహరించారు.

* స్ట్రెంత్‌ అండ్‌ స్ట్రక్చర్‌
రాబోయే కొన్నేళ్లలో సీఐఎస్‌ఎఫ్‌లో మొత్తం సైనికుల సంఖ్య 1.8 లక్షల మందికి పైగా చేరుకొనే అవకాశం ఉంది. వివిధ గ్లోబల్ టెర్రర్ సంస్థల నుండి ముఖ్యమైన సంస్థలకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సీఐఎస్‌ఎఫ్‌ బలాన్ని పెంచడానికి ఆసక్తిగా ఉంది. ఇతర పారామిలిటరీ దళం తరహాలోనే CISFకి కూడా డైరెక్టర్ జనరల్ (DG) ర్యాంక్ అధికారి నాయకత్వం వహిస్తారు. డీజీకి సహాయం చేసే నలుగురు అదనపు డైరెక్టర్ జనరల్(ఏడీజీ) స్థాయి అధికారులు ఉంటారు. ఈ ADG లేదా ప్రత్యేక డైరెక్టర్ జనరల్ (SDG) స్థాయి అధికారులు ఉత్తర, దక్షిణ, విమానాశ్రయ విభాగాలు, ప్రధాన కార్యాలయాలను చూసుకుంటారు.

ఈ దళంలో దాదాపు డజను మంది ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) ర్యాంక్ అధికారులు ఉన్నారు. వీరు వివిధ రంగాలు, శిక్షణ మొదలైనవాటిని చూసుకుంటారు. ఎయిర్‌పోర్ట్ సెక్టార్‌కి, ఒక DIG, డిప్యూటీ కమాండెంట్ స్థాయి అధికారులు అధిక ఫుట్‌ఫాల్ విమానాశ్రయాల భద్రతను చూస్తారు. వీరిని చీఫ్‌ ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్లుగా పిలుస్తారు. CISF అగ్నిమాపక విభాగానికి కూడా IG స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు.

Know Your Paramilitary: అత్యుత్తమ భారత రక్షణ దళాల్లో ఒకటి నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌.. NSG ప్రత్యేకతలు ఇవే..!


* స్టోరీస్ ఆఫ్ వాలర్
CISF కీలకమైన సంస్థలు, ప్రదేశాలను రక్షించడానికి ప్రధానంగా పనిచేస్తుంది. దాని దళాలు దాడులను తిప్పికొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్ వంటి వివిధ సున్నితమైన ప్రాంతాలలో శాంతి భద్రతల విధులను కూడా సీఐఎస్‌ఎఫ్‌ నిర్వర్తించింది. జవాన్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. 2020 జనవరిలో జమ్మూలోని నగ్రోటాలోని బాన్ టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేయడానికి CISF జవాన్లను మోహరించారు. వారు ఒక ట్రక్కును చూసి దానిని ఆపమని సిగ్నల్ ఇచ్చారు. వాహనం క్యాబిన్‌లో అనుమానాస్పద బ్యాగులు పడి ఉండడాన్ని బలగాలు గుర్తించాయి. అందులో దాక్కొని ఉన్న ఉగ్రవాదులను అంతమొందించి.. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా 1993లో దంతేవాడ (ఛత్తీస్‌గఢ్)లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన బైలాడిలా ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ వద్ద హిరోలి మ్యాగజైన్‌కు రక్షణగా CISFని కోరింది. గ్రెనేడ్లు, పెట్రోల్ బాంబులు, తుపాకీలు మొదలైన వాటితో ఆయుధాలు కలిగి ఉన్న నక్సల్స్ (సుమారు 500 మంది) పెద్ద సమూహాన్ని దళాలు చూశాయి. సిబ్బందిని లొంగిపోవాలని కోరుతూ CISF పోస్ట్‌పై నక్సల్స్ భయంకరమైన దాడికి పాల్పడ్డారు. కానీ సీఐఎస్ఎఫ్ దళాలు ధైర్యంగా పోరాడి పరిమిత ఆయుధాలతో వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నాయి. బుల్లెట్ల మార్పిడి సమయంలో, సీఐఎస్‌ఎఫ్‌లోని ఎనిమిది మంది సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. విధుల నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారు. CISF నియంత్రణలో ఉన్న విమానాశ్రయంలో ఒక్క తీవ్రవాద సంఘటన కూడా జరగలేదు.

* బడ్జెట్
దళాల సంఖ్య పరంగా ఇప్పుడు జవాన్ల సంఖ్య పెరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం తన బడ్జెట్‌ను పెంచింది. 2022-23కి సంబంధించి, ఆధునికీకరణ కోసం బడ్జెట్‌తో సహా CISF కోసం కేంద్రం రూ.12,201.90 కోట్లు కేటాయించింది.

* శిక్షణ
CISF దాదాపు ప్రతి రెండు సంవత్సరాలకు తన శిక్షణా చార్టర్‌ను అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. ప్రత్యేక వ్యూహాలు, ప్రత్యేక సాయుధ పోరాట నైపుణ్యాలపై CISF నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ శిక్షణ అందిస్తోంది. ఇది వివిధ భద్రతా ఏజెన్సీలకు శిక్షణను కూడా ఇస్తుంది. చార్టర్ అమెరికన్ ప్రత్యేక దళం SWAT (ప్రత్యేక ఆయుధాలు, వ్యూహాలు) ఆధారంగా రూపొందింది. వివిధ విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, ముఖ్యమైన సంస్థలలో మోహరించిన క్విక్ రియాక్షన్ టీమ్‌లు (QRTలు) కూడా ఈ అకాడమీ నుండి శిక్షణ పొందుతాయి.

Know Your Paramilitary: నేపాల్‌, భూటాన్‌ సరిహద్దుల పర్యవేక్షణలో SSB కీలకం.. సశస్త్ర సీమ బల్ ప్రత్యేకతలు..


CISF అధికారులు, జవాన్లు ఆయుధాలు, వ్యూహాత్మక శిక్షణా సెషన్‌లతో సహా దాదాపు రెండు డజన్ల కోర్సులను అభ్యసించవచ్చు. VVIPలను కవర్ చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్, అనేక ఇతర ఏజెన్సీల నుంచి కూడా శిక్షణ పొందుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central governmennt, CISF, Paramilitary, Police

తదుపరి వార్తలు