ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో 18,000 పైగా భారతీయ విద్యార్థులు (Indian Students in Ukraine) చిక్కుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. వారిలో తెలుగు విద్యార్థులు (Telugu Students in Ukraine) కూడా ఉన్నారు. తెలుసు విద్యార్థులు సుమారు 1500 నుంచి 3000 మధ్య ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. వారంతా భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ఇక్కడి ప్రభుత్వ సాయం కోరుతున్నారు. భారత ప్రభుత్వం కూడా విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌కు వెళ్లిన విద్యార్థుల్లో ఎక్కువ మంది అక్కడ మెడిసిన్ చదవడానికి వెళ్లినవారే. మిగతావారు ఇంజనీరింగ్ కోసం వెళ్తుంటారు. అయితే అమెరికా, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలు ఉండగా ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు ఎందుకు వెళ్లారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ కోర్సులు చదువుతున్నవారిలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. తక్కువ మందే ఇంజనీరింగ్ కోర్సులు చేస్తుంటారు. ఉక్రెయిన్ రాజధానికి కీవ్‌కు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలోనే మెడిసిన్ కోర్సుల్లో చేరినవారు ఎక్కువ. ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) గుర్తింపు ఉంది. అక్కడి కాలేజీల్లో చదివిన డిగ్రీలు భారతదేశంలో చెల్లుతాయి. ఆ కోర్సుల్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది.
NMDC Jobs 2022: హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ జాబ్ నోటిఫికేషన్... రూ.1,30,000 వరకు వేతనం
కర్నాటకలోని రాయిచూర్ జిల్లా దేవసుగురు గ్రామానికి చెందిన చెన్నవీరేష్ కూడా ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు 2021 అక్టోబర్ 4న అక్కడి వెళ్లారు. అతని తండ్రి రైతు. ఆరేళ్ల తర్వాత అతను డాక్టర్ అయి వస్తాడని వారంతా కలలు కంటున్నారు.
ఇప్పుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాది భారతీయ విద్యార్థుల్లో చెన్నవీరేష్ కూడా ఒకరు. చెన్నవీరేష్ News18.com తో వాట్సప్ కాల్ ద్వారా మాట్లాడారు.
ఇక పూరణ్ చంద్రశేఖర్ కర్నాటక నుంచి ఉక్రెయిన్ వెళ్లిన మరో విద్యార్థి. బెంగళూరులోని సుంకడకట్టెలో అతని తల్లిదండ్రులు చంద్రశేఖర్, రాజేశ్వరి నివసిస్తున్నారు. విజయనగర్‌లోని ఏఎస్సీ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్లో పూరణ్ 95 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. నీట్లో క్వాలిఫై అయ్యాడు. కానీ కరోనా వైరస్ మహమ్మారితో ఒక ఏడాది కోల్పోతానన్న భయంతో ఉక్రెయిన్ వెళ్లాడు.
Scholarship: విదేశాల్లో చదువుకుంటారా? స్కాలర్షిప్కు అప్లై చేయండి ఇలా
వీళ్లలాగే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపారు. అక్కడ రెసిడెన్షియల్ కార్డ్, వీసా, ఏజెన్సీ ఫీజు, ప్రయణా ఖర్చులు, వసతి లాంటి ఖర్చులన్నీ మొదటి ఏడాది కలిపి రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షలు ఖర్చవుతుంది. రెండో ఏడాది నుంచి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఖర్చవుతుంది. మెడికల్ విద్యార్థులు అక్కడే మాస్టర్స్ చదివేందుకు 10 ఏళ్ల వీసా ప్లాన్ చేసుకుంటారు. ఉక్రెయిన్‌లో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ పేరుతో ఉన్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌కు (NEXT) హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Career and Courses, Medical college, Russia-Ukraine War