Telangana Inter Results 2021: ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు... News18లో చూసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Telangana Inter Results 2021: విద్యార్థులందరికీ ఇంటర్‌ సెకండియర్‌ ప్రాక్టికల్స్‌కు వందశాతం మార్కులు ఇచ్చారు.

  • Share this:
    తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన మొత్తం 4,51,585 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వీరిలో 1,76,719 మందికి ‘ఏ’ గ్రేడ్‌ రాగా... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్‌ సాధించారు. ఇక 61,887 మంది ‘సీ’ గ్రేడ్‌... 1,08,093 మంది ‘డీ’ గ్రేడ్‌లో పాస్ అయ్యారు. ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు కేటాయించారు. విద్యార్థులందరికీ ఇంటర్‌ సెకండియర్‌ ప్రాక్టికల్స్‌కు వందశాతం మార్కులు ఇచ్చారు.



    కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేసి, సెకండియర్‌ పరీక్షలను తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయ్యింది.
    Published by:Kishore Akkaladevi
    First published: