హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main Result 2021: నేడే జేఈఈ మెయిన్ ర్యాంకుల విడుదల.. కటాఫ్ మార్కులు​, ర్యాంక్ లిస్ట్​ను ఇలా చెక్​ చేసుకోండి

JEE Main Result 2021: నేడే జేఈఈ మెయిన్ ర్యాంకుల విడుదల.. కటాఫ్ మార్కులు​, ర్యాంక్ లిస్ట్​ను ఇలా చెక్​ చేసుకోండి

నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)

నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)

JEE Main Result 2021: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాన్ని తనిఖీ చేయడానికి, అభ్యర్థులు ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రిజల్ట్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.

బీఈ, బీటెక్​, బీఆర్క్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జాయింట్​ ఎంట్రన్స్​ ఎగ్జామ్​ (జేఈఈ) మెయిన్ ర్యాంకులు ఈ రోజు విడుదలకానున్నాయి. నాలుగో విడత పర్సంటైల్​తో పాటు తుది ర్యాంకులను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) ప్రకటించనుంది. దీంతో పాటు ఆన్సర్ కీ, కేటగిరీ వారీగా కటాఫ్​ మార్కుల​ను విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాన్ని తనిఖీ చేయడానికి, అభ్యర్థులు ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రిజల్ట్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. ఇందు​లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అడ్వాన్స్‌డ్​కు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది.

జేఈఈ మెయిన్​ సెషన్​ 4ను ఆగస్టు​ 26, 27, 31, సెప్టెంబర్​ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న 334 ఎగ్జామ్​ సెంటర్లలో జరిగింది. జేఈఈ మెయిన్ ఫలితాల కోసం jeemain.nta.nic.in, nta.ac.in, nta.nic.in, Ntaresults.nic.in వెబ్​సైట్లను సందర్శించండి.

* JEE మెయిన్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?

విద్యార్థులు ముందు jeemain.nta.nic.in వెబ్‌సైట్​లోకి లాగిన్ అవ్వాలి. తరువాత హోమ్‌పేజీలో కనిపించే జేఈఈ మెయిన్స్​ రిజల్ట్​ లింక్‌పై క్లిక్ చేయండి. మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. సబ్​మిట్​ చేసి మీ రిజల్ట్​ చెక్​ చేసుకోండి.

EPF-Aadhar link: ఈపీఎఫ్‌-ఆధార్ లింక్ గ‌డువు పొడ‌గింపు.. డిసెంబ‌ర్ వ‌ర‌కు అవ‌కాశం

Money Transfer to Wrong Account: పొరపాటుగా వేరే అకౌంట్‌కు వెళ్లిన డబ్బును తిరిగి పొందవచ్చా ?.. అందుకు ఏం చేయాలి ?

* డిజిలాకర్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ముందు డిజిలాకర్ లింక్‌పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ పేరు, పుట్టిన తేదీని నమోదు చేయండి. మీ జెండర్​, మొబైల్​ నంబర్​, ఆరు అంకెల సెక్యూరిటీ పిన్​ వంటివి ఎంటర్​ చేయండి. తరువాత మీ ఈ–మెయిల్ ఐడీని ఎంటర్​ చేయండి. అనంతరం మీ ఆధార్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి సబ్​మిట్​ కొట్టండి. ఆ తర్వాత మీ యూజర్​ నేమ్​ సెట్​ చేసుకోండి. డిజిలాకర్ ఖాతా క్రియేట్​ అయిన తర్వాత, మీ జేఈఈ మెయిన్స్​ రిజల్ట్​ డాక్యుమెంట్లను యాక్సెస్​ చేయడానికి బ్రౌజ్ డాక్యుమెంట్స్​పై క్లిక్ చేసి, మీ డాక్యుమెంట్​ నంబర్​ను ఎంటర్​ చేయండి.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: JEE Main 2021

ఉత్తమ కథలు