Spice Jet: స్పైస్ జెట్‌లో క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి ఇలా

Spice Jet | ఆసక్తిగల అమ్మాయిలు స్పైస్‌జెట్ అధికారిక వెబ్‌సైట్ https://www.spicejet.com ఓపెన్ చేసి Careers సెక్షన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: August 23, 2019, 5:58 PM IST
Spice Jet: స్పైస్ జెట్‌లో క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి ఇలా
Spice Jet: స్పైస్ జెట్‌లో క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం, image: SpiceJet)
news18-telugu
Updated: August 23, 2019, 5:58 PM IST
స్పైస్ జెట్... భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఒకటి. స్పైస్ జెట్ విమానయాన సంస్థలో నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. స్పైస్ జెట్‌లో ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ విభాగంలో క్యాబిన్ క్రూ లేదా ఫ్లైట్ అటెండెంట్ పోస్టులకు ఎప్పుడైనా దరఖాస్తు చేయొచ్చు. ఫ్లైట్‌లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు వారికి సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు పెళ్లికాని అమ్మాయిలకు మాత్రమే. ఆసక్తిగల అమ్మాయిలు స్పైస్‌జెట్ అధికారిక వెబ్‌సైట్ https://www.spicejet.com ఓపెన్ చేసి Careers సెక్షన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. భవిష్యత్తులో ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు స్పైస్ జెట్ అభ్యర్థులకు సమాచారం ఇస్తుంది. అప్‌డేటెడ్ సీవీతో పాటు పాస్‌పోర్ట్ సైజ్, పార్మల్స్‌లో ఉన్న ఫుల్ లెంత్ ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఆధార్, పాన్ కార్డ్, పాస్‌ పోర్ట్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.

Spice Jet Cabin Crew Jobs: స్పైస్ జెట్‌లో క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు అర్హతలివే...


డిపార్ట్‌మెంట్: ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్

జాబ్: క్యాబిన్ క్రూ లేదా ఫ్లైట్ అటెండెంట్ (అమ్మాయిలకు మాత్రమే)
విద్యార్హత: 10+2 పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు: 18 నుంచి 27 ఏళ్లు (క్యాబిన్ క్రూ అనుభవం ఉన్నవారికి వయస్సులో సడలింపు)


ఎత్తు: కనీసం 155 సెంటీమీటర్లు
Loading...
హిందీ, ఇంగ్లీష్ భాషలో రాయడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.

ఎలాంటి నియామకాలు ఉన్న స్పైస్ జెట్ వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. ఎవరైనా తమ విమానయాన సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే వారి మాటల్ని నమ్మొద్దని కంపెనీ చెబుతోంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IAF Jobs: యువకులకు గుడ్ న్యూస్... ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Naval Dockyard Jobs: నావల్ డాక్‌యార్డ్‌లో 1233 అప్రెంటీస్ పోస్టులు
First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...