Home /News /jobs /

KNOW CUT OFF FOR ADMISSIONS TO TOP 10 NITS CLOSING RANK JEE MAIN EVK

IIT JEE 2021: టాప్ 10 ఎన్ఐటీలో చేరాలంటే ఎంత ర్యాంక్ రావాలో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఎట్టకేలకు JEE మెయిన్ 2021 ఫలితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాప్ 10 ఎన్ఐటీ(NIT)లో సీటు రావడానికి కావాల్సిన ర్యాంక్ అంచనా తెలుసుకుందాం.

    విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఎట్టకేలకు JEE మెయిన్ 2021 ఫలితాలను ప్రకటించింది. చాలా మంది విద్యార్థులు ఈ పరీక్షరాశారు. జన‌ర‌ల్ అభ్యర్థులు ఐఐటీలో సీటు పొందాలంటే క‌నీసం 87.8992241 స్కోర్ రావాల్సి ఉంటుంది. గ‌తేడాదితో పోలిస్తే ఈ క‌ట్ఆఫ్(Cut off) త‌క్కువ గ‌తేడాది జేఈఈ అడ్వాన్స్ అర్హ‌త పొందేందుకు అవ‌స‌ర‌మైన మార్కులు 90.3765335 అవ‌స‌రం అయ్యాయి. ఒక‌వేళ ఐఐటీ(IIT)లో సీట్ సాధించ లేని వారికి ఎన్ఐటీ ఉత్త‌మ ఎంపిక . JEE స్కోర్ ఆధారంగా, విద్యార్థులు 31 NIT లు, 26 IIIT లు మరియు 29 ఇతర ప్రభుత్వ నిధులతో కూడిన సాంకేతిక సంస్థలలో (ఇతర- GFTI లు) ప్రవేశం పొందేందుకు అర్హులు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ద్వారా కౌన్సెలింగ్(Counseling) ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. విద్యార్థులు(Students) తమ జేఈఈ మెయిన్ స్కోర్(Score) మరియు ర్యాంకుల ప్రకారం ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోగలుగుతారు. ఒక‌వేళ అభ్య‌ర్థి ఎన్ఐటీ(NIT)లో చేరాలంటే ఎంత ర్యాంక్ కావాలో తెల‌సుకొందాం.

    IIT Education: ఐఐటీలో ఆర్ట్స్, కామర్స్ స్ట్రీమ్‌లు.. చదవొచ్చు


    ప్ర‌తీ ఏడాది ఆయా ఇనిస్టిట్యూట్‌లు క‌ట్ఆఫ్ విడుద‌ల చేస్తాయి. ఈ ఎన్ఐటీల‌కి అప్లే చేయాలంటే క‌ట్‌-ఆఫ్ మార్కులతోపాటు ర్యాంక్ కూడా ముఖ్యం. ఈ సంవత్సరం కట్-ఆఫ్ జాబితా త్వరలో విడుదల చేస్తాయి. జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఈ ఏడాది టాప్ 10 ఎన్ఐటీ క‌ట్ ఆఫ్ వివ‌రాలు అంచ‌నా వివ‌రాలు ఇలా ఉన్నాయి.

    టాప్ టెన్ ఎన్ఐటీలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈలో చేరేందుక రావాల్సిన ర్యాంకు అంచ‌నా..

    NIT తిరుచ్చి:
    CSE- 781వ ర్యాంక్
    ECE- 3,022వ ర్యాంక్
    EEE- 5,381 వ ర్యాంక్

    NIT సురత్కల్
    CSE- 1,324వ ర్యాంక్
    ECE- 4,151వ‌ ర్యాంక్
    IT- 2,838వ ర్యాంక్

    NIT రూర్కెలా
    CSE- 2,021వ ర్యాంక్
    ECE- 4,566వ ర్యాంక్
    EE- 7,811వ ర్యాంక్

    NIT వరంగల్
    CSE- 4,559వ ర్యాంక్
    EEE-1,2678వ ర్యాంక్
    BT-19,855వ ర్యాంక్

    NIT కాలికట్
    ECE- 8,539వ ర్యాంక్
    EEE- 13,866వ ర్యాంక్
    CSE- 6,481వ ర్యాంక్

    NIT దుర్గాపూర్
    CSE- 2,024వ ర్యాంక్
    ECE- 4,575 వ ర్యాంక్
    ME- 6,979 వ ర్యాంక్

    VNIT నాగపూర్
    CSE- 3,858వ ర్యాంక్
    ECE- 7,586 వ ర్యాంక్
    EEE- 11,411 వ ర్యాంక్

    MNIT జైపూర్
    CSE- 3,441వ ర్యాంక్
    ECE- 7,330వ ర్యాంక్
    ME- 14,340 వ ర్యాంక్

    MNNIT అలహాబాద్
    CSE- 2,779 వ ర్యాంక్
    IT- 4,029 వ ర్యాంక్
    ECE- 6,379 వ ర్యాంక్

    NIT కురుక్షేత్రం
    CSE- 5,457వ ర్యాంక్
    IT- 6,679వ ర్యాంక్
    ECE- 11,559వ ర్యాంక్jee
    Published by:Sharath Chandra
    First published:

    Tags: EDUCATION, Engineering course, Exams, JEE Main 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు