Jobs: భారతదేశంలో డిమాండ్ ఉన్న 10 జాబ్స్ ఇవే

Jobs in demand | కరోనా వైరస్ సంక్షోభంతో అనేక ఉద్యోగాలు సంక్షోభంలో పడుతున్నాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో కూడా ఈ స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

news18-telugu
Updated: May 13, 2020, 10:58 AM IST
Jobs: భారతదేశంలో డిమాండ్ ఉన్న 10 జాబ్స్ ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభం జాబ్ మార్కెట్ రూపురేఖల్ని మార్చేస్తోంది. లక్షలాది ఉద్యోగాలకు ముప్పుతీసుకొచ్చింది. అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఇప్పటికీ డిమాండ్ ఉంది. మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగాలకు వచ్చే ముప్పే ఉండదు. ఎలాంటి సంక్షోభంలో అయినా ఉద్యోగాలను కాపాడుకోవచ్చు. మరి ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కూడా మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఏవో, ఎలాంటి స్కిల్స్ ఉండాలో తెలుసుకోండి.

1. Python programming language: స్టాక్ ఓవర్‌ఫ్లో డెవలపర్ సర్వే ప్రకారం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో పైథాన్‌ది రెండో స్థానం. నేర్చుకోవడం కూడా సులువే. డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్ ఎక్కువగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. గూగుల్, ఫేస్‌బుక్ లాంటి కంపెనీల్లో వీరికి మంచి జీతాలు లభిస్తాయి.

2. Node Javascript (Node.js): డిమాండ్‌లో ఉన్న మరో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజ్‌లు, అప్లికేషన్స్‌లో ఈ ప్రోగ్రామ్ ఉపయోగిస్తారు. ఇటీవల ఐఓటీ బేస్డ్ ప్రొడక్ట్స్, సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో బడాబడా ఐటీ సంస్థలు వీటిపై దృష్టిపెట్టాయి.

3. Mobile application development: ఇంట్లోకి సరుకులు కొనడం దగ్గర్నుంచి బ్యాంకింగ్ సేవల వరకు మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే కంపెనీల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్ డెవలపర్లకు ఎప్పడూ డిమాండ్ ఉంటుంది.

Jobs in india, jobs in demand, how to plan career, Coronavirus Pandemic, Coronavirus crisis, కరోనా వైరస్ సంక్షోభం, కరోనావైరస్ మహమ్మారి, భారతదేశంలో ఉద్యోగాలు, కెరీర్ టిప్స్, లేటెస్ట్ జాబ్స్
ప్రతీకాత్మక చిత్రం


4. User interface/ User Experience design (UI/UX): ఇటీవల కాలంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌కు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. యూజర్లు సులువుగా ఆపరేట్ చేసేలా యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ చేయడం పెద్ద సవాలే. అందుకే యూఐ, యూఎక్స్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది.

5. Digital curriculum developer: కరోనా వైరస్ సంక్షోభంతో ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు ఆన్‌లైన్ కోర్సులపై దృష్టిపెడుతున్నాయి. వారికి ఈ పని సులువుగా చేసేవాళ్లే డిజిటల్ కరిక్యులమ్ డెవలపర్లు. వెబ్ డిజైన్, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ తెలిస్తే చాలు.6. Information privacy certified professional: కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ కంపెనీలు తమ డేటా రిస్కులో పడుతుందేమోనని భయపడుతున్నాయి. డేటా ప్రైవసీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్‌కు ముప్పు ఉంటుందని భావిస్తున్నాయి. వీటిని అడ్డుకునేందుకు చీఫ్ ప్రైవసీ ఆఫీసర్స్‌ని నియమించుకుంటున్నాయి.

Jobs in india, jobs in demand, how to plan career, Coronavirus Pandemic, Coronavirus crisis, కరోనా వైరస్ సంక్షోభం, కరోనావైరస్ మహమ్మారి, భారతదేశంలో ఉద్యోగాలు, కెరీర్ టిప్స్, లేటెస్ట్ జాబ్స్
ప్రతీకాత్మక చిత్రం


7. Chief actuary: బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, బ్రోకింగ్ సంస్థల్లో చీఫ్ ఆక్చురీలకు డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం భారతదేశంలో క్వాలిఫైట్ ఆక్చురియల్ ప్రొఫెషనల్స్ 500 లోపే ఉన్నారు.

8. Digital project management: వెబ్‌సైట్స్, యాప్స్ రూపొందించడంతో పాటు వాటిని మెయింటైన్ చేయడం డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజర్ పని. కరోనావైరస్ సంక్షోభం కారణంగా చాలా సంస్థలు ఫిజికల్ నుంచి డిజిటల్‌కు మారే అవకాశాలు ఎక్కువ. కాబట్టి డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజర్లకు డిమాండ్ పెరుగుతుంది. సిక్స్ సిగ్మా, ఎగైల్, డెవ్‌ఆప్స్ లాంటి కోర్సులతో ఐటీ సెక్టార్, ఆన్‌లైన్ రీటైల్, ఇ-కామర్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

9. Financial risk manager: బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్లకు మంచి డిమాండ్ ఉంది. స్టాక్ మార్కెట్ పరిస్థితుల్ని అంచనా వేసి పెట్టుబడుల్ని ప్లాన్ చేయడం వీరి పని.

10. Salesforce certification: సేల్స్‌ఫోర్స్ అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. భారతదేశంలో ఐటీ ప్రొఫెషనల్స్‌తో పాటు సేల్స్‌ఫోర్స్ సర్టిఫికేషన్‌కు మంచి డిమాండ్ ఉందంటారు హెచ్ఆర్ నిపుణులు.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IOCL Jobs: ఐఓసీఎల్‌ నుంచి రెండు జాబ్ నోటిఫికేషన్లు... దరఖాస్తు గడువు పొడిగింపు

Job Loss: ఉద్యోగం పోయిందా? ప్రభుత్వం నుంచి సాయం పొందొచ్చు ఇలా

Free Courses: ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు... 5 వెబ్‌సైట్స్ ఇవే

 

 
First published: May 13, 2020, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading